సోమవారం పూణెలోని కోట వద్ద కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మహిళతో పాటు కోటకు వచ్చిన ఓ వ్యక్తే చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
పూణె : సోమవారం పూణెలోని రాయ్‌గఢ్ ఫోర్ట్ ప్రాంతంలో 26 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యం అయ్యింది. దీంతో పోలీసులు దీని మీద మంగళవారం హత్య కేసు నమోదు చేశారు. మహిళతో పాటు పోర్టుకు వచ్చిన వ్యక్తే ఆమె మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఈ కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి ప్రాథమిక విచారణలో, చనిపోయిన మహిళ బంధువుల్లో ఒకరు పూణేలోని వార్జే ప్రాంతంలో ఉండే వ్యక్తి తప్పిపోయినట్లు గుర్తించారు. వీరిద్దరూ కలిసి ఉంటున్నారని తెలిసింది. అయితే ఆ వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
వీడు మృత్యుంజయుడు... 110 కి.మీ వేగంతో దూసుకెళుతున్న రైల్లోంచి జారిపడ్డ యువకుడు
మృతురాలు అహ్మద్‌నగర్‌లోని కోపర్‌గావ్‌కు చెందిన దర్శనా పవార్. ఆమెఇటీవల మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్సీ) నిర్వహించిన మహారాష్ట్ర స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 9న ఓ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె పూణెకు వచ్చినట్లు ఆమె తండ్రి పోలీసులకు తెలిపాడు.
"రెండు రోజుల తరువాత, ఆమె నెర్హే ప్రాంతంలోని తన స్నేహితుడిని కలిసి.. తరువాతి రోజు సింహగడ్ కోటకు వెళుతున్నానని చెప్పి ఆమె ఇంటి నుండి బయలుదేరింది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. తరువాత కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ మీద తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాయగఢ్ ఫోర్ట్ దగ్గర కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను బంధువులు గుర్తించారు. వారి సహాయంతోనే పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతికి గల కారణాలను గుర్తించేందుకు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
