తోడబుట్టిన అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు ఒకే వేదికపై పెళ్లిళ్లు చేసుకోవడం సర్వ సాధారణం. కానీ.. కన్న తల్లి.. కడుపున పుట్టిన బిడ్డ ఒకేసారి పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నారా..? ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా..? నిజంగానే జరిగింది. తల్లీ, కూతుళ్లు ఒకే మండపంపై పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గోరఖ్‌పూర్‌‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేదికలో అరుదైన వివాహం జరిగింది. 53 సంవత్సరాల తల్లి, 27 సంవత్సరాల కూతురు వివాహం ఆ సామూహిక వివాహ వేదికలో జరిగింది. మహిళ పేరు బేలీ దేవీ కాగా.. ఆమె భర్త 25 సంవత్సరాల క్రితం మరణించాడు.

25 ఏళ్ల తరువాత ఆమె తన మరిదితో వివాహం చేసుకుంది. అతని వయసు సుమారు 55 ఏళ్లు. బేలీ దేవి భర్త రైతు కాగా.. అతను 55 సంవత్సరాల వరకు వివాహం చేసుకోలేదు. ఈ సామూహిక వివాహ వేదికలో మొత్తం 63 జంటలు ఒక్కటయ్యాయి. ఇందులో ఒక ముస్లిం జంటకూడా ఉంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

బేలీ దేవి చిన్న కూతురు పేరు ఇందూ. గత వారం అక్కడ ఏర్పాటు చేసిన వివాహవేదికలో ఇందు 29 సంవత్సరాల రాహుల్‌ను పెళ్లి  చేసుకుంది. బేలీ దేవి మీడియాలో ఉద్యోగం చేస్తోంది. కాగా కార్యక్రమానికి జిల్లాలోని సీనియర్ అధికారులు, సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.