సిద్ధి: తనపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తి విషయంలో ఓ మహిళ తెలివిగా వ్యవహరించింది. ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దాంతో ఆమె అతని మర్మాంగాలను కోసేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోన సిద్ధి జిల్లాలో జరిగినట్లు పోలీసులు శనివారం చెప్పారు 

జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో గల ఉమరిహా గ్రామంలో గురువారం రాత్రి ఆ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. దానిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆ సంఘటన జరిగినట్లు ఆమె తెలిపింది. 

45 ఏళ్ల మహిళ తన 13 ఏళ్ల కుమారుడితో ఇంట్లో ఉంది. ఆ సమయంలో నిందితుడు (45) ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి దొంగ ప్రవేశించాడనే భయంతో ఆమె కుమారుడు భయంతో బయటకు పరుగులు తీశాడు. లోనికి వచ్చిన వ్యక్తి మహిళను తోసేసి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దాదాపు 20 నిమిషాల పాటు అతన్ని ఆమె ప్రతిఘటించింది. 

తనను రక్షించుకోవడానికి మహిళ మంచం కింద ఉన్న కొడవలి తీసుకుని, అతని మర్మాంగాలను కోసేసింది. ఆ తర్వాత ఆమె పోలీసు అవుట్ పోస్టుకు చేరుకుని శుక్రవారం తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో ఫిర్యాదు చేిసంది. 

నిందితుడిని పోలీసులు అస్పత్రిలో చేర్చారు ఆ తర్వాత అతన్ని సిద్ధి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని రేవా జిల్లాలోని సంజయ్ గాంధీ వైద్య కశాశాల, ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కూడా మహిళపై ఫిర్యాదు చేశాడు.