ముంబై: ఏడాదిన్నరగా ముగ్గురు కూతుళ్లతో పాటు భార్యను ఇంట్లోంచి బయటకు రాకుండా చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగినట్లు పోలీసులు గురువారంనాడు తెలిపారు .

పోలీసులు పాంధార్ పూర్ నగరంలని జెండా గుల్లి ప్రాంతంలో గల ఇంటిపై దాడి చేసి మహిళకు, ఆమె కూతుళ్లకు విముక్తి కలిగించారు. ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. 

మహిళ ఎస్ఓఎస్ నోట్ ను తన ఇంటి బయటకు విసిరేయడం వల్ల సంఘటన వెలుగు చూసింది. ఆ ఎస్ఓఎస్ నోట్ ను చూసిన ఓ మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. 

పాంధార్ పూర్ పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టి, 41 ఏళ్ల వయస్సు గల మహిళతో పాటు ఎనిమిది నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల ముగ్గురు కూతుళ్లకు విముక్తి కలిగించారు. 

కొడుకు పుట్టలేదనే కారణంతో ఏడాదిన్నరగా తనను భర్త ఓ గదిలో బంధించాడని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. భర్త తనను లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అబార్జ,న్లు చేయించాడని ఆమె ఆరోపించింది.