Asianet News TeluguAsianet News Telugu

భర్తతో గొడవ.. ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కిందపడి..

భార్యభర్తల మధ్య గొడవలు ఆరుగురి ప్రాణాలు తీశాయి. ఈ దారుణ విషాద ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

woman committed suicide with her five daughters in chhattisgarh - bsb
Author
Hyderabad, First Published Jun 11, 2021, 10:21 AM IST

భార్యభర్తల మధ్య గొడవలు ఆరుగురి ప్రాణాలు తీశాయి. ఈ దారుణ విషాద ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ తన ఐదుగురు కూతుళ్లతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

మహాసముంద్-బెల్సొందా మార్గంలోని ఇమ్లిభట కెనాల్ వంతెనమీద రైలు పట్టాలపై పడి ఉన్న ఆరు మృతదేహాలను గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బెంచా గ్రామానికి చెందిన కేజవ్ రామ్ సాహు పొరుగూరు ముధెనాలోని రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నారు.

బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చి కేజవ్ రామ్ ఇంటి ఖర్చుల విషయమై భార్య ఉమా సాహు(45)తో గొడవపడ్డాడు. రాత్రి భోజనం తరువాత అతడు నిద్రపోయాడు. 

భర్తతో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన ఉమా సాహు, కుమార్తెలు అన్నపూర్ణ (18), యశోద(16), భూమిక (14), కుంకుం(12), తులసి(10)లను వెంట తీసుకుని అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రైల్వే వంతెనపైకి వెళ్లింది. వేగంగా వెల్తున్న రైలు కిందపడి వారంతా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. 

వారి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. కనిపించకుండాపోయి తన భార్య, కూతుళ్ల కోసం బుధవారం రాత్రే వెదికానని, ఉదయానికల్లా వారు తిరిగి వస్తారని అనుకున్నానని కేజవ్ సాహు పోలీసులకు తెలిపాడు. కాగా, ఈ ఘటన మీద వెంటన దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవలని సీఎం భూపేశ్ బఘేల్ ఆదేశాు జారీ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios