Asianet News TeluguAsianet News Telugu

విషాదం : ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో.. అస్తికలతో ఆ తల్లి చేసిన పని...

ప్రమాదంలో మరణించిన తనయుడి అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు వెళ్ళిన ఓ తల్లి మృతదేహం గా ఒడ్డుకు చేరింది. కోవళం బీచ్లో ఈ విషాద ఘటన ఆదివారం వెలుగు చూసింది. 

woman committed suicide in beach in chennai
Author
Hyderabad, First Published Aug 16, 2021, 9:31 AM IST

చెన్నై : ఒంటరితనం మనుషుల్ని విషాదంలోకి నెట్టేస్తుంది. ఇక తమకు ఎవరూ లేరు... అనే మాట హృదయాల్ని మెలిపెడుతుంది. కొడుకే లోకంగా బతికే తల్లికి అలాంటి విషాదాన్నే నింపింది. ఓ ఒంటరి తల్లి, కొడుకు జీవితాల్లో బైక్ యాక్సిడెంట్ దారుణ విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెడితే.....

ప్రమాదంలో మరణించిన తనయుడి అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు వెళ్ళిన ఓ తల్లి మృతదేహం గా ఒడ్డుకు చేరింది. కోవళం బీచ్లో ఈ విషాద ఘటన ఆదివారం వెలుగు చూసింది. తాంబరం సమీపంలోని పెరుంగళత్తూరు చెందిన గుండు మేడుకు చెందిన వాసంతి (42),  ఆమె కుమారుడు గోకులన్ (21)  స్థానికంగా ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు.

గత నెల 22వ తేదీన మోటార్ సైకిల్ ప్రమాదంలో  గోకులన్ మరణించాడు.  ఒక్కగానొక్క కుమారుడు  దూరం కావడంతో  వసంతి ఒంటరి అయ్యారు.  అతడి ఇంట్లో ఫొటో వద్దనుంచి ప్రతి రోజు పూజ చేస్తూ వచ్చారు.  తీవ్ర శోకంతో ఆమె ఉండటమే కాకుండా, ఆస్తికల్ని ఇంట్లోనే ఉంచుకోవడం ఇబ్బందులు ఖండించారు. ఆస్తికల్ని సముద్రంలో కలిపేయాలని సూచించారు దీంతో ఆమె శనివారం అస్తికల్ని సముద్రంలో కలిపేందుకు కోవళం బీచ్ కి వెళ్లారు.  తిరిగి ఇంటికి చేరకపోవడంతో జాడ కోసం బంధువులు గాలించారు. పోలీసులకు సమాచారం అందించారు.

ఆమె ఫోన్ రింగవుతున్నా, ఎవరూ తీయలేదు. ఎట్టకేలకు ఓ వ్యక్తి ఆ ఫోన్ ను అందుకుని బీచ్ లో పడి ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. కోవలం బీచ్ కి వెళ్లి అక్కడ జాలర్ల వద్ద విచారించగా, ఓ మహిళ గంటలతరబడి సముద్రం ఒడ్డున ఓ చోట కూర్చుని తీవ్రంగా ఏడుస్తున్నట్లుగా పేర్కొన్నారు.  కదిలించినా ఆమె మాట్లాడకపోవడం తో పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహం ఒడ్డుకు చేరింది. తీవ్ర ఆవేదనతో ఉన్న వసంతి అస్తికల్ని సముద్రంలో కలిపి తర్వాత బలవన్మరణానికి పాల్పడిన ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios