ఆమె నాలుగు సంవత్సరాలుగా ఓ కాలేజీ లెక్చరర్ ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమ పేరిట బాగానే నమ్మించాడు. తీరా పెళ్లి చేసుకుందామనే సరికి ముఖం చాటేశాడు. దీంతో.. ఆ బాధ తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుత్తణి సమీపంలోని నల్లాటూరుకు చెందిన మణి కుమార్తె మణిమేగలై (21) తాళవేడుకు చెందిన మునిరత్నం కుమారుడు రాజ్‌కుమార్‌ (26)నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో తనను వివాహం చేసుకోవాలని రాజ్‌కుమార్‌ను మణిమేగలై కోరగా, అతను నిరాకరించాడు. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా తిరుగుతున్నారు. ఇటీవల మరోసారి ఆమె తన ప్రేమికుడిని పెళ్లి విషయం నిలదీయగా.. అసలు చేసుకోనంటూ తేల్చి చెప్పాడు. 

దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంచుకొని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదుచేసి రాజ్‌కుమార్‌కు విచారిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఓ ప్రైవేటు విద్యాసంస్థలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది.