భువనేశ్వర్: భర్తపై అనుమానంతో ఓ భార్య దారుణమైన సంఘటనకు పాల్పడింది. భర్త వేరే మహిళతో వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె ఘాతుకానికి పాల్పడింది. భర్త మర్మాంగాలను కోసేసింది.

తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటన ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. 

పదునైన కత్తితో ఆమె తన భర్త మర్మాంగాలను కోసేసిందని,  దాంతో బాధ తట్టుకోలేక అతను పెద్దగా కేకలు వేశాడని, కేకలు విని ఇరుగుపొరుగువారు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించారని పోలీసులు చెప్పారు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను అరెస్టు చేశారు. తమిళనాడులో పనిచేస్తున్న అతను మూడు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు.