నయా ట్రెండ్ షూరు.. విడాకుల ఫోటోషూట్ కూడా వచ్చేసిందిగా..
Divorced Photoshoot: విడాకుల తర్వాత మహిళలు మానసికంగా నిరాశకు గురి కావడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ,ఈ సనాతన భావజాలాన్ని బద్దలు కొట్టేంది ఓ మహిళ. ఆమె తన భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత ఓ ఫోటోషూట్ చేసుకుంది. ఇప్పడు ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Divorced Photoshoot: వెడ్డింగ్ ఫోటోషూట్‌లు చూశాం, ప్రీ-వెడ్డింగ్ షూట్‌లు చూశాం, కొన్నిసార్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్ అనే పేరు కూడా విని ఉంటాం.. కానీ మీరు ఎప్పుడైనా 'డివోర్స్ ఫోటోషూట్'అనే పేరు ఎప్పుడైనా విన్నారా? చెన్నైలో నివసించే షాలిని అనే మహిళ తన భార్త నుండి విడిపోయిన తర్వాత.. డిప్రెషన్‌కు గురి కాకుండా 'విడాకుల ఫోటోషూట్' చేసుకుంది. విడాకులను సానుకూలంగా స్వీకరించింది. విన్నూతమైన శైలిలో ఫోటోషూట్ చేసింది.
ఈ విడాకుల ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను షాలిని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదటి ఫోటోలో షాలిని తన చేతిలో 'డివోర్స్డ్' అనే అక్షరాల దండను పట్టుకుని తన డివోర్స్ విషయాన్ని హైలైట్ చేసింది. రెండవ ఫోటోలో ఆమె ఒక చేతిలో మద్యం సీసా, మరొక చేతిలో ఓ బోర్డు పట్టుకుని నిలబడి ఉంది. మరొక ఫోటోలో షాలిని తాను,తన భర్త కలిసి ఉన్న ఫోటోను చింపివేయడం కనిపిస్తుంది. ఇది కాకుండా..మరో ఫోటో షాలిని, ఆమె భర్త ఫోటో ఉన్న ఫ్రేమ్‌ను తన కాలితో తొక్కుతూ కనిపిస్తుంది.
విడాకుల తర్వాత సాధారణంగా స్త్రీలు మానసికంగా కృంగిపోవడం కనిపిస్తుంది. భర్త నుండి విడిపోయిన తర్వాత వారు సాధారణ జీవితంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ, షాలిని మాత్రం ఆ సనాతన భావజాలాన్ని బద్దలు కొట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో చిత్రాలను షేర్ చేయడమే కాదు..
పైపెచ్చు ఇలా రాసింది. 'విడాకులు ఒక వైఫల్యం కాదు! ఇది మీకు , మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక మలుపు. భర్తను విడిచిపెట్టి ఒంటరిగా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి, నేను ఈ ఫోట్ షూట్ ను ధైర్యవంతులైన మహిళలందరికీ అంకితం చేస్తున్నాను.' అని పేర్కొన్నారు. ఈ ఫోటోలు చూస్తున్న నెట్టిజన్లు విభిన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.