Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్ల విడాకులను .... సెలబ్రేట్ చేసుకుంటున్న యువతి..!

ప్రతిఫలం లేని సంబంధాన్ని విడిచిపెట్టి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత ఆమె ఎలా సంతోషంగా ఉండలేదో వివరించింది.

Woman celebrates 4 years of her divorce with heartwarming post. Internet is inspired
Author
First Published Jan 25, 2023, 11:42 AM IST

దంపతుల మధ్య  విబేధాలు వస్తే.... విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది రోజుల్లో. అయితే... విడాకుల తర్వాత అంతా సాధారణంగా ఉండదు. అప్పటి వరకు ఉన్న జీవితం ఒకలా.... ఆ తర్వాత మరోలా ఉంటుంది. ఆ తర్వాత... తిరిగి మళ్లీ సాధారణ జీవితం సాగించడం  చాలా కష్టంగా ఉంటుంది. ఓ అమ్మాయి మాత్రం విడాకుల తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంది. తనకు విడాకులు వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోందని... విడాకుల యానివర్సరీ ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. 

శాశ్విత అనే యువతి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. ఈ నాలుగేళ్ల  విడాకులను ఆమె ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె లింక్ డిన్ లో షేర్ చేయడం గమనార్హం. ప్రతిఫలం లేని సంబంధాన్ని విడిచిపెట్టి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత ఆమె ఎలా సంతోషంగా ఉండలేదో వివరించింది.

 

“గత 4 సంవత్సరాలలో, జీవితపు రోడ్‌మ్యాప్‌లో నేను ఊహించని చాలా ఆసక్తికరమైన విషయాలను చేసే అవకాశం నాకు లభించింది. అదీ విషయం - ప్రణాళిక లేని, నిర్దేశించని జలాలు చాలావరకు అందమైన ఫలితాలను ఇస్తాయి” అని ఆమె పోస్ట్‌లో రాసింది.

విడాకుల తర్వాత తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దగ్గర నుంచి.. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం తాను పడిన కష్టాన్ని ఆమె వివరించింది. ప్రస్తుతం తన కొత్త జీవితాన్ని ఆనందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. కాగా... ఆమె పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios