ఎన్నికల్లో గెలవడమంటే సాధారణ విషయం కాదు.. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, డబ్బు ఇలా ఎన్నింటినో వుపయోగించాలి. అప్పుడైనా గెలుస్తారో లేదో గ్యారెంటీ లేదు. అన్ని కష్టాలు పడిన తర్వాత వచ్చే గెలుపు ఇచ్చే కిక్క్ మామూలుగా వుండదు.
ఎన్నికల్లో గెలవడమంటే సాధారణ విషయం కాదు.. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, డబ్బు ఇలా ఎన్నింటినో వుపయోగించాలి. అప్పుడైనా గెలుస్తారో లేదో గ్యారెంటీ లేదు.
అన్ని కష్టాలు పడిన తర్వాత వచ్చే గెలుపు ఇచ్చే కిక్క్ మామూలుగా వుండదు. అందుకే ఎన్నికల్లో గెలిచిన నేతల్ని తమ అనుచరులు భుజాలపై మోస్తూంటారు. కానీ భర్త సాధించిన విజయానికి ఉబ్బితబ్బిబ్బయిన భార్య.. ఏకంగా ఆయనను భుజాలపై ఎత్తుకుని ర్యాలీగా వెళ్లింది.
వివరాల్లోకి వెళితే.... మహారాష్ట్రలోని పుణె జిల్లా ఖేడ్ తాలుకాలోని పలు అనే గ్రామ సర్పంచ్‌గా సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి గెలిచాడు. ప్రత్యర్థిని 44 ఓట్ల తేడాతో ఓడించాడు.
భర్త గెలిచిన ఆనందంలో అతని భార్య రేణుక తన భుజాలపైకి ఎత్తుకుని ఊరంతా తిరిగుతూ సంబరాలు చేసుకుంది ఆయన భార్య రేణుక సంతోష్ గౌరవ్. పలు గ్రామంలో ఉన్న 7 స్థానాల్లో సంతోష్ గౌరవ్‌కు చెందిన జఖ్మట్ట దేవి గ్రామ వికాస్ పానెల్ 6 స్థానాలను గెలుపొందింది.
మాజీ సర్పంచి బాబన్ సావంత్, వికాస్ సొసైటీ చైర్మన్ రాందాస్ సావంత్ మద్దతుతో సంతోష్ గౌరవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశాడు. ప్రత్యర్థి జఖ్మట్ట గ్రామ్ వికాస్ పరివర్తన్ పానెల్‌పై స్పష్టమైన మెజారిటీతో జఖ్మట్ట దేవి గ్రామవికాస్ పానెల్ ఈ విజయాన్ని నమోదు చేసుకుంది.
కాగా, కోవిడ్ కారణంగా ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థులు ర్యాలీ నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ కొన్ని పరిమితులు విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది కనిపించకూడదని, భౌతికదూరం తప్పని సరి అని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా కేవలం ఐదుగురు వ్యక్తులతో, భౌతిక దూరాన్ని పాటిస్తూ రేణుక సంతోష్ ర్యాలీని జరపడం విశేషం.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 19, 2021, 8:37 PM IST