గొర్రెలు కాసుకునే ఓ యువతిపై దాడి చేసి గొంతు కోసి మరీ అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ని లింగనహళ్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... దొడ్డ గ్రామానికి చెందిన అంజలి(20) గొర్రెలు కాసుకుంటూ జీవనం  సాగిస్తోంది. కాగా... ఆమె గ్రామం శివారులో మంగళవారం గొర్రెలు కాసుకుంటూ ఉండగా... కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే... వారిపై అంజలి ఎదురు దాడి చేసింది. దీంతో... గొంతు కోసి హత్య చేశారు.

కాగా.. ఈ హత్య ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనే విషయాలు తెలియరాలేదు. అత్యాచారయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా... దీనిపై కూడా క్లారిటీ లేదని పోలీసులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అయితే... గ్రామస్తులు మాత్రం.. ఓ యువకుడు ప్రేమపేరిట అంజలి వెంట పడేవాడని.. అతనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.