ఆమెకు పెళ్లయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. భర్త తరచూ వేధిస్తుండటంతో తట్టుకోలేక పోయింది. భర్తను వదిలేసి పుట్టింటికి చేరింది. అక్కడ మేనత్త కొడుకుతో కలిసి ఉంటోంది. అయితే.. అనూహ్యంగా ఆ మనేత్త కొడుకే ఆమెను దారుణంగా హత్య చేయడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌డి.కోటె తాలూకాలోని క్యాతనహళ్లి గ్రామానికి చెందిన ప్రేమకుమారి (25)కి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త పెట్టే వేధింపులు తాళలేక ఆమె భర్తను వదిలి తన మేనత్త కుమారుడైన కిరణ్‌తో కలిసి ఉంటోంది.

అయితే.. కిరణ్ తో కూడా ప్రేమ కుమారికి గొడవలు మొదలయ్యాయి. ప్రతి విషయంలో ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కిరణ్‌ అర్ధరాత్రి ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. బాధితురాలి అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.