కొత్త పెళ్లి కూతురు.. ఆనందంగా నవ్వుతూ, తుళ్లుతూ ఉండాల్సిందిపోయి.. నిర్జీవంగా పడి ఉంది. అది కూడా.. ఓ సూట్ కేసులో చనిపోయి కనిపించింది. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఘజియాబాద్ నగరంలో పోలీసులకు సోమవారం ఉదయం 8 గంటలకు ఓ నల్లరంగు సూట్ కేస్ కనిపించింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న సూట్ కేస్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని దాన్ని తెరచి చూడగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. సూట్ కేస్ లో మృతదేహమై కనపించిన మహిళకు ఇటీవల పెళ్లి అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో మహిళను హతమార్చి ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో పెట్టారని పోలీసులు చెప్పారు. కాగా... ఎవరు హత్య చేశారు..? ఎందుకు ఈ కిరాతకానికి పాల్పడాల్సి వచ్చింది అనే విషయాలను ఆరాతీస్తున్నట్లు పోలీసులు చెప్పారు.  సదరు మహిళ కుటుంబసభ్యుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.