Asianet News TeluguAsianet News Telugu

సెక్స్, డబ్బు, మోసం.. కోట్లకు పడగెత్తిన ఈ మహిళా బ్లాక్ మెయిలర్ స్టోరీ ఇదే

ఒడిశాలో ఓ పేద కుటుంబంలో పుట్టి రాజధాని నగరం చేరిన ఓ యువతి అక్కడే పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగైదు సంవత్సరాల్లోనే వారు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. సెక్స్, డబ్బు, మోసం చేయడం వారి మోడస్ ఆపరెండీగా ఉన్నది.
 

woman blackmailer in odisha, sex, mony, betrayal is the modus operandi
Author
First Published Oct 14, 2022, 1:48 PM IST

భువనేశ్వర్: పేదరికం నుంచి నాలుగైదు సంవత్సరాల్లోనే కోటీశ్వరురాలైంది. పేద కుటుంబంలో జన్మించి చిన్న పట్టణం వెళ్లి ఓ సెక్యూరిటీ గార్డ్ కంపెనీలో పని చేసింది. ఆ తర్వాత ఓ బ్యూటీ పార్లర్‌లో చేరింది. అక్కడే ఆమె జీవితం మారిపోయింది. ఆ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ ఆమె ఓ సెక్స్ రాకెట్ నడిపినట్టు తెలుస్తున్నది. యూజ్డ్ కార్ షోరూమ్ నడిపే తన భర్తకు రాజకీయనేతలు, బిల్లర్లు, బిజినెస్‌మెన్లు, ఇతర ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. ఈ డబ్బున్నవారితో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొందరు సంపన్నులకు, పలుకుబడి ఉన్నవాళ్లకు అమ్మాయిలను పంపి, వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. పెద్ద మొత్తంలో డబ్బులు గుంజడం మొదలు పెట్టింది. ఇటీవలే ఎక్స్‌టార్షన్ కేసులో అరెస్టు అయిన అర్చన నాగ్ స్టోరీ ఇది. ఈ కథ ఆధారంగా సినిమా తీయడానికి కూడా ఓ ఒడియా దర్శకుడు ప్రయత్నిస్తున్నాడంటే.. గాఢతను అర్థం చేసుకోవచ్చు.

ఒడిశాలోని ఆకలి కేకల జోన్‌గా పిలిచే కలహండి జిల్లాలో లాంజిగడ్‌లోని ఓ పేద కుటుంబంలో అర్చన నాగ్ జన్మించింది. ఆమె ఇప్పుడు రాజభవనాలకు,ఇంపోర్టెడ్ ఇంటీరియర్ డెకరేషన్లు, లగ్జరీ కార్లు, శ్వేత అశ్వం, నాలుగు హైబ్రీడ్ కుక్కలు, ఇంకా మరెన్నో విలాస వంతమైన వాటిని కలిగి ఉంది.

అదే జిల్లాలోని కేసింగ పట్టణంలో ఆమె పెరిగింది. అక్కడే ఆమె తల్లి పని చేస్తుండగా అర్చన 2015లో భువనేశ్వర్‌కు వచ్చింది. తొలుత ఆమె ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో పని చేసింది. ఆ తర్వాత బ్యూటీ పార్లర్‌లో చేరింది. అక్కడ బాలాసోర్‌కు చెంది జగబందు చంద్ అనే వ్యక్తితో పరిచయమైంది. 2018లో ఆమెను పెళ్లి చేసుకుంది. అదే సమయంలో ఆమె సెక్స్ రాకెట్ నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి.

జగబందు యూజ్డ్ కార్ల షోరూం నడిపాడు. ఆయనకు చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. వారితో వీరిద్దరి దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్చన ఆ రిచ్ పీపుల్స్‌, ఇన్‌ఫ్లుయెన్షనల్ పీపుల్స్‌తో పరిచయాలు పెంచుకుంది. వారికి మహిళలను తోడుగా పంపడం మొదలు పెట్టింది. ఆ సందర్భంలోనే వారికి తెలియకుండా అభ్యంతరకర ఫొటోలను ఆమె తీయడం మొదలు పెట్టినట్టు పోలీసులు వివరించారు.

ఇతర అమ్మాయిలతో కలిసి ఉండగా చాటుగా తీసిన తన ఫొటోలను అర్చన చూపెట్టి రూ 3 కోట్లు డిమాండ్ చేసిందని ఓ ఫిలిం ప్రొడ్యూసర్ నయపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్స్ రాకెట్‌లో తనను వాడుకున్నదని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అక్టోబర్ 6వ తేదీన అరెస్టు చేశారు. 

2018 నుంచి 2022 మధ్య కాలంలో ఆ దంపతులు సుమారు రూ. 30 కోట్లు కూడబెట్టుకున్నట్టు పోలీసుల అంతర్గత అంచనా నివేదిక తెలిపింది. 

Also Read: మస్సాజ్ సెంటర్‌లో మహిళపై కస్టమర్, మేనేజర్ గ్యాంగ్ రేప్.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

ఈ విషయం ఇప్పుడు ఒడిశాలో రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ బీజేడీ ఎమ్మెల్యే, మంత్రులను టార్గెట్ చేస్తూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios