మెట్రో స్టేషన్ లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాగా... గమనించిన ఓ అధికారి ఆమెను రక్షించారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్ ఉమేష్ పాండే.. బుధవారం ఉదయం మెట్రో స్టేషన్ లో ఉన్నారు. ఉదయం 7గంటల 30 నిమిషాల సమయంలో 21ఏళ్ల యువతి  ఫుట్ వేర్ బ్రిడ్జ్ ఎక్కి... అక్కడి నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. దానిని గమనించిన ఉమేష్ పాండే వెంటనే ఆమెను రక్షించారు. కిందకు దూకబోతున్న  యువతిని పట్టుకొని వెనక్కి లాగిన ఆ అధికారి.. ఆమెను వెంటనే కంట్రోల్ రూమ్ లో కూర్చోపెట్టారు. 

ఆ వెంటనే ఆ యువతి భర్త ఆమె కోసం స్టేషన్ కి రావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయినాబాద్ కి చెందిన దంపతులు ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడ్డారు. కాగా... భార్యభర్తల మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కాగా అధికారులు ఆమెకు నచ్చచెప్పి భర్తతో ఇంటికి పంపించారు.