Asianet News TeluguAsianet News Telugu

అల్లరి చేస్తుందని.. ఆరేళ్ల కూతురిని కర్రతో కొట్టి చంపిన తల్లి..

ఆరేళ్ల కూతురు అల్లరి చేస్తుందని కోపానికి వచ్చిన ఓ తల్లి కర్రతో బాది హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

woman assassinated daughter over angry in tamilnadu
Author
Hyderabad, First Published Aug 12, 2022, 7:11 AM IST

చెన్నై : ఇంట్లో అల్లరి చేస్తోందని ఆగ్రహించిన తల్లి కన్న కూతురి మీద కర్రతో దాడి చేసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే,,, తిరువణ్ణామలై సమీపంలోని అరట్టపట్టు గ్రామానికి చెందిన భూపాలన్ కూలీ కార్మికుడు. ఇతని భార్య సుకన్య.  వీరికి ఇద్దరు పిల్లలు. ప్రసన్నదేవ్, రితిక (06) ఉన్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు చదువుకుంటున్నారు. సుకన్య, భూపాలన్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో సుకన్య పిల్లలను తీసుకొని అమ్మగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. మంగళవారం ప్రభుత్వ సెలవు కావడంతో  ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారు.

అల్లరి చెయ్యొద్దని ఎన్నిసార్లు సర్ది చెప్పినా పిల్లలు వినలేదు. దీంతో కోపానికి వచ్చిన సుకన్య ఇంట్లో ఉన్న కర్రతో రితిక తల మీద కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. అది గమనించిన సుకన్య వెంటనే చిన్నారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దహనక్రియలు చేసేందుకు అమ్మగారి ఇంటికి తీసుకు వెళ్ళింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భూపాలన్ కు సమాచారం అందించారు. భూపాలన్  తిరువన్నామలై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో పోలీసులు తల్లి సుకన్యను అరెస్టు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

సీన్ రివర్స్.. ‘నాకు తెలీకుండా.. నా భార్య రెండో పెళ్లి చేసుకుంది.. న్యాయం చేయండి’.. ఓ భర్త ఆవేదన..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ 7న హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తెను ఇష్టారీతిన కొట్టడంతో పాటు.. నేలకేసి విసిరికొట్టి.. బయటకు వెళ్ళిపోయాడు. దీంతో ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ.. రెండు రోజుల తరువాత మృతి చెందింది. హైదరాబాద్లోని సైఫాబాద్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ నివాసి బాసిత్ అలీఖాన్, మాసబ్ ట్యాంక్ సమీపంలోని ఫస్ట్ లాన్సర్ కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఏసీ గార్డ్స్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి.  ఆటో డ్రైవర్ గా వచ్చే సంపాదన చాలక ఇతర కారణాలతో బాసిత్ కొన్నాళ్లుగా పిల్లలపై విపరీతంగా కోప్పడ్డం, కొట్టడం చేస్తున్నాడు.  

శనివారం సాయంత్రం పనికి వెళ్లే సమయంలో మూడో కుమార్తె  సకీనా ఫాతిమా(3) బాత్రూంలో ఆడుకుంటుంది. బయటికి రమ్మని తండ్రి పిలిస్తే వెళ్లలేదు. దీంతో పట్టలేని కోపంతో గంటెతో ఇష్టం వచ్చినట్లు ఆ చిన్నారిని కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. గట్టిగానే నెట్టడంతో కింద పడిన ఆమె స్పృహ తప్పింది. తర్వాత కుమార్తెను పైకి ఎత్తి నేలకేసి కొట్టి బయటకి వెళ్ళిపోయాడు. స్పృహ వచ్చిన తర్వాత కుమార్తెను చూసిన తల్లి నిద్ర పోతుంది అని భావించింది. కొద్దిసేపటి తర్వాత పాలు పట్టేందుకు  లేపడానికి ప్రయత్నించగా, శరీరం చల్లగా ఉండటం. నోటి నుంచి రక్తం రావడంతో ఆందోళన చెందిన తల్లి వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఉస్మానియాలోని ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆ తరువాత చనిపోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios