Asianet News TeluguAsianet News Telugu

గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ గిఫ్ట్.. ఫోన్ ఆన్ చేయగానే...!

 పింకీ ఎంతో సంతోషంగా ఆ ఫోన్ ఉపయోగించడం మొదలు పెట్టింది. మరుసటి రోజు పింకీ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ ఫోన్ దొంగతనం చేయబడిందని చెప్పి పింకీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు

Woman Arrested  For Using Stolen Mobile Phone in Madhyapradesh
Author
Hyderabad, First Published Jan 21, 2022, 10:40 AM IST

ఓ యువకుడు న్యూ ఇయర్ రోజున.. తన గర్ల్ ఫ్రెండ్ కి ఓ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ ఫోన్ చూసి ఆ అమ్మాయి ఆనందంతో పొంగిపోయింది. వెంటనే.. ఫోన్ స్విచ్ఛాన్ చేసింది. అలా స్విఛ్చ్ ఆన్ చేసిందో లేదో.. ఆమెను కొద్ది గంటల్లోనే పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఎందుకంటే.. అది దొంగిలించిన ఫోక్ కావడం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధోగంజ్ పట్టణానికి చెందిన కాలు(22) అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ పింకీకి న్యూ ఇయర్ కానుకగా ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. పింకీ ఎంతో సంతోషంగా ఆ ఫోన్ ఉపయోగించడం మొదలు పెట్టింది. మరుసటి రోజు పింకీ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ ఫోన్ దొంగతనం చేయబడిందని చెప్పి పింకీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీసుల విచారణలో పింకీ తన బాయ్‌ఫ్రెండ్ కాలు గురించి చెప్పింది. దీంతో పోలీసులు కాలుని అరెస్టు చేసి.. మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించారు. అప్పుడు కాలు తను ఆ ఫోన్ మరొకరి నుంచి కొన్నానని చెప్పాడు. కానీ పోలీసులు కాలుకి ఒక వీడియో చూపించారు. అది ఒక సిసిటీవి వీడియో. అందులో కాలు, మరొక వ్యక్తితో కలిసి రోడ్డుపై స్కూలు నుంచి వస్తున్న ఒక అమ్మాయిని కత్తితో బెదిరించి ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. అది చూసిన కాలు తన బండారం బయటపడిందని అర్థం చేసుకున్నాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు.

తన గర్ల్ ఫ్రెండ్ పింకీ ఒక కాస్ట్లీ మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా కావాలని అడిగింది. కానీ కాలు వద్ద అది కొనడానికి డబ్బులు లేవు. అయినా తన గర్ల్‌ఫ్రెండ్ అలగిందని.. ఎలాగైనా ఒక మొబైల్ ఫోన్ కావాలని తన మిత్రుడు శుభాష్‌తో చెప్పాడు. అప్పుడు శుభాష్ ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేద్దామని ప్లాన్ వేశాడు. అలా కాలు, అతని మిత్రుడు శుభాష్ మొబైల్ ఫోన్ కోసం 70 కిలోమీటర్ల దూరం గ్వాలియర్ వెళ్లి అక్కడ రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న ఒక స్కూల్ విద్యార్థిని చేతి నుంచి మొబైల్ ఫోన్ కాజేశారు. కానీ కాలు దాన్ని స్విచాఫ్ చేసి పెట్టాడు.

 వారం రోజుల తరువాత పింకీకి ఆ ఫోన్ కానుకగా ఇచ్చాడు. అలా జనవరి 16న పింకీ ఆ మొబైల్ ఫోన్‌ని స్విచాన్ చేయగా.. దాని ఐఎంఇఐ నెంబర్‌ను ట్రాక్ చేస్తూ పోలీసులు పింకీ ఇంటికి చేరుకున్నారు. కాలు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతనిపై దొంగతనం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు కాలు స్నేహితుడు శుభాష్ కూడా పట్టుబడ్డాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios