తమిళనాడులోని వేలూరులో మహిళా వైద్యురాలి మీద ఆటోలో సామూహిక అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మీద అత్యాచారం చేసిన నిందితుల్లో మైనర్లు కూడా ఉండడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.
వేలూరు : వేలూరు సత్ వచ్చారిలో ఓ వైద్యురాలిపై gang rape ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి స్నేహితుడితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తున్న Woman doctorని.. శుక్రవారం తెల్లవారుజామున వేలూరు జిల్లా కాట్పాడి వద్ద Share Autoలో ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి gang rape చేశారు. ఈ కేసులో పోలీసులు మంగళవారం నలుగురిని అరెస్టు చేశారు, వారిలో ఇద్దరు minorలు కూడా ఉన్నారు, మరొకరి కోసం గాలిస్తున్నారు.
వెల్లూరు పోలీసు సూపరింటెండెంట్ ఎస్ రమేష్ కన్నన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలు ఈ ఘోరానికి సంబంధించి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో నేరం వెలుగులోకి వచ్చిందని చెప్పారు.
శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఓ మహిళ, తన స్నేహితుడితో కలిసి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆటోలో అప్పటికే ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు వారు ఎక్కిన తరువాత ఆటోను దారి మళ్లించి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ స్నేహితుడిని కొట్టి, బెదిరించి.. మహిళను కత్తితో బెదిరించిసామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, రూ.40 వేల నగదు, రెండు సవర్ల బంగారు ఆభరణాలను కూడా ఈ ముఠా దోచుకెళ్లింది.
వారి నుంచి బయటపడిన తరువాత.. ఎలాగో వారు హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నలుగురిని పట్టుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను జ్యుడీషియల్ కస్టడీకి, బాలనేరస్థులను బోర్స్టాల్ హోంకు తరలించారు. ఐదో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
నిందితులపై తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం, 1998లోని 376డి (గ్యాంగ్ రేప్, సెక్షన్ 4 (మహిళపై వేధింపులకు జరిమానా) సహా IPC సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
ఇదిలా ఉండగా, మంగళవారం నాడు వేలూరు సత్ వచ్చారిలో ఓ వైద్యురాలిపై gang rape ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. వేలూరులోని ఓ private hospitalలో ఓ యువతి doctorగా పనిచేస్తున్నారు. ఈమె మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి కాట్పాడిలోని సినిమా థియేటర్ లో సెకండ్ షోకి వెళ్ళింది. ఆతర్వాత స్నేహితులతో కలిసి వేలూరుకు షేర్ ఆటోలో బయలుదేరింది. ఆ ఆటోలో అప్పటికే నలుగురు వ్యక్తులు ఉన్నారు.
వారంతా కలిసి ఆటోను సత్ వచ్చారిలోని మరో రోడ్డుకు మరలించారు. యువతి డ్రైవర్ ను నిలదీయగా.. సమాధానం ఇవ్వకుండా ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. యువతి స్నేహితునిపై attack చేసి అక్కడి నుంచి బెదిరించి తరిమివేశారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు కలిసి ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు సత్ వచ్చారి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
