మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి - భారత్ కు మాల్దీవుల అల్టీమేటం..

India-Maldives Relations : భారత్ - మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సైనికులను వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవులు తేల్చి చెప్పింది. మార్చి 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది.

Withdraw forces till March 15 - Maldives ultimatum to India..ISR

India-Maldives row : భారత్, మాల్దీవుల మధ్య దౌత్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ వరకు తమ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కి పిలుచుకోవాలని మాల్దీవులు అల్టీమేటం జారీ చేసినట్టుగా అక్కడి మీడియా వర్గాలు తెలిపాయని ‘ఇండియా టీవీ’ కథనం పేర్కొంది. వాస్తవానికి ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మాల్దీవులలోని భారత హైకమిషన్ అధికారులు మాలేలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. అక్కడ ఇరు దేశాల మధ్య సంబంధాలను కుదిపేసిన పరిణామాలపై చర్చలు జరిపారు. 

ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదు - మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ క్రమంలోనే మాల్దీవుల నుంచి భారత దళాలను ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు ముయిజు ప్రతిపాదించారని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం పాలసీ డైరెక్టర్ అబ్దుల్లా నజీమ్ మీడియాకు తెలిపారు. ‘‘మార్చి 15 లోపు భారత బలగాలను ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు ప్రతిపాదించారు. ప్రభుత్వం, అధ్యక్ష కార్యాలయం ఈ తేదీని ప్రతిపాదించాయి.’’ అని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.

ఫామ్ హౌస్ కు అవి కావాలని ఫోన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్.. షాప్ యజమాని షాక్..

మాల్దీవుల్లో భారత్ కు 75 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. చైనా అనుకూల అధ్యక్షుడైన ముయిజు భారత సైనిక సిబ్బందిని మల్దీవుల నుంచి ఖాళీ చేయించి, వాణిజ్యాన్ని సమతుల్యం చేస్తానని గతంలోనే వాగ్దానం చేశారు. అయితే చైనాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశాలను ముగించుకుని మాల్దీవులకు తిరిగి వచ్చిన మరుసటి రోజే సమావేశం జరగడం, ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. 

పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా దూసుకొచ్చిన లారీ.. యువతి మృతి..

ముయిజు పర్యటనలో చైనా-మల్దీవులకు మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇరు దేశాలు సహకారాన్ని విస్తరించడానికి అంగీకరించుకున్నాయి. రెండు దేశాల అధ్యక్షులు 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. పర్యటన ముగించుకొని మాల్దీవులకు వచ్చిన తరువాత ఎయిర్ పోర్టులో ముయిజు మీడియాతో మాట్లాడారు. తన దేశం చిన్నదే కావచ్చని, కానీ తమని బెదిరించడానికి ఎవరికీ లైసెన్స్ ఇవ్వదని అన్నారు. 

ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్.. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన బీజేపీ ఫైర్ బ్రాండ్..

‘‘ఈ సముద్రంలో మాకు చిన్న ద్వీపాలు ఉన్నప్పటికీ, 900,000 చదరపు కిలోమీటర్ల విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలం ఉంది. ఈ మహాసముద్రంలో అత్యధిక వాటా ఉన్న దేశాలలో మాల్దీవులు ఒకటి. ఈ సముద్రం ఫలానా దేశానికి చెందినది కాదు. ఈ హిందూ మహాసముద్రం కూడా అందులో ఉన్న అన్ని దేశాలకు చెందుతుంది’’ అని ఆయన భారత్ ను ఉద్దేశించి మాట్లాడారు. తాము ఎవరి పెరట్లోనూ లేమని, తమది స్వతంత్ర, సార్వభౌమ రాజ్యమని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios