Asianet News TeluguAsianet News Telugu

చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో

చేతిలో నయా పైసా లేకున్నా కూడ  ఇద్దరు యువకులు  టీ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

With No Money In Account, Boys Find Jugaad At ATM To Buy Chai, Amuse The Internet  lns
Author
First Published Feb 20, 2024, 11:30 AM IST | Last Updated Feb 20, 2024, 11:32 AM IST


న్యూఢిల్లీ: చేతిలో చిల్లిగవ్వ లేదు. అయినా కూడ  ఇద్దరు యువకులు  తాము అనుకున్నది సాధించారు. టీ తాగేందుకు చేతిలో నగదు లేకున్నా తమ ఉపాయంతో  టీ తాగేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకొని  టీ తాగారు ఇద్దరు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

టీ, కాఫీలు తాగని వారిని మనం చాలా అరుదుగా చూస్తాం.  టీ  తాగే వారి సంఖ్య విపరీతంగా ఉన్నందునే  రోడ్డు పక్కనే  టీ స్టాల్స్ కు విపరీతమైన గిరాకీ వస్తుంది.సమయానికి టీ తాగకపోతే కొందరికి తలనొప్పి వస్తుంది. మరికొందరికి ఏ పనిచేయడానికి తోచదు.  అయితే  టీ తాగడం కోసం ఇద్దరు యువకులు  చేసిన వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుంది.  ఈ ఇద్దరు యువకుల చేసిన పనిని చూసిన నెటిజన్లు  ఫిధా అవుతున్నారు.

ఇద్దరు యువకులు టీ తాగడం కోసం  అవసరమైన డబ్బులను ఏటీఎం నుండి డ్రా చేసేందుకు వెళ్లారు. అయితే  బ్యాంకులో  నగదు లేదు. దీంతో  ఈ ఇద్దరు యువకులు టీ తాగడం కోసం తమ మేథస్సుకు పని చెప్పారు. వినూత్నంగా ఆలోచించి  టీకి అవసరమైన డబ్బులను  సంపాదించారు. 

ఎక్స్ లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తమ బ్యాంకు ఖాతాలో డబ్బు లేని విషయాన్ని గుర్తించిన ఆ యువకులకు వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 

also read:టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు: తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

తమకు సమీపంలోని ఎటీఎంలలోకి వెళ్లి  తమ బ్యాంకు ఖాతాలోని నగదు గురించి స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. ఇలా వచ్చిన రసీదులను  పేపర్లు కొనుగోలు చేసే దుకాణంలో విక్రయించారు.  ఈ రసీదులకు  ఆ దుకాణ యజమాని రూ. 20 చెల్లించాడు.ఈ రూ.20 లతో  టీ షాపులోకి వెళ్లి ఇద్దరు యువకులు టీ కొనుగోలు చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా తమ ఉపాయంతో  టీ కోసం అవసరమైన  నిధులను సేకరించారు. 

also read:పెళ్లి పందిరిలోనే వధువు కాళ్లు తాకిన వరుడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ వీడియో  ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఈ ఇద్దరు యువకులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. నిక్ హంటర్ అనే నెటిజన్ ఎక్స్ లో ఈ వీడియోను పోస్టు చేశారు.  ఈ వీడియోకు  ఐదు లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇలాంటి  ఆలోచనలు భారత్ లోనే ఉండాలని నిక్ హంటర్ చమత్కరించారు. 

 

ఈ వీడియోపై నెటిజన్లు చర్చలు చర్చించుకుంటున్నారు.  తమ సమస్య పరిష్కారం కోసం  ఇద్దరు యువకులు  తెలివైన పరిష్కారం కనుగొన్నారని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఒక కప్పు టీ తాగడానికి ఇద్దరు యువకులు చాలా కష్టపడ్డారని  మరికొందరు వ్యాఖ్యానించారు.  
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios