న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో 83,883 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 1,043 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 38,53,407కి చేరుకొన్నాయి. రోజువారీ నమోదైన కేసుల్లో ప్రపంచంలోనే అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటికీ 8,15,538  యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకినవారిలో 29,70,493 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనాతో దేశంలో 67,376 మంది మరణించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఈ నెల సెప్టెంబర్ 2వ తేదీ నాటికి దేశంలో 4,55,09,380 మంది శాంపిల్స్ సేకరించారు. గత 24 గంటల్లో 11,72,179 మంది శాంపిల్స్ పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.

బుధవారం నాటికి దేశంలో 37,69,523 కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి కరోనాతో మరణించినవారి సంఖ్య 66,333 మందిగా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలో కరోనా నుండి కోలుకొన్న రోగుల రికవరీ రేటు  77 శాతంగా ఉంది. కరోనాతో మరణించిన రోగుల మరణాల రేటు 1.7 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.