పాము కరిస్తే.... ఏ డాక్టర్ అయినా వైద్యం చేస్తాడు. చదువు సంధ్య లేని వాళ్లు ఎవరైనా ఉంటే.... నాటు వైద్యమో, బూత వైద్యమో చేస్తారు... కానీ ఓ డాక్టర్ లఅయ్యి ఉండి రోగికి వైద్యం చేయాల్సిందిపోయి... బూత వైద్యం చేశాడు. శాస్త్ర సాంకేతి రంగాల్లో దేశం ముందుకు పోతోంది. ఎలాంటి జబ్బుపైనా వైద్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాలన్నీ తెలిసిన డాక్టర్... బూత వైద్యం చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రం షియోపూర్ గ్రామానికి చెందిన యోగేంద్ర సింగ్ రాథోడ్ అనే వ్యక్తిని ఇటీవల పాము కరిచింది. దీంతో... అతనిని బంధువు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్ రోగికి అసలు వైద్యం పక్కన పెట్టి బూత వైద్యం చేయడం గమనార్హం.

వేపాకులు చేతపట్టుకొని ఆయన అలా బూత వైద్యం చేయడాన్ని గమనించిన కొందరు ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట షేర్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక మీడియా హాస్పిటల్  యాజమాన్యాన్ని ఈ ఘటనపై ప్రశ్నించింది.

దానికి జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆస్పత్రి ఆవరణలో బూత వైద్యం చేయడం తప్పు అని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా... ఇంతకీ ఆ రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం మాత్రం తెలియరాలేదు.