తమిళ సినీ హీరోలకు, బీజేపీకి మధ్య ఎప్పట్నుంచో మాటల యుద్ధం జరుగుతుంది. తమిళ ప్రముఖ హీరోలు విజయ్, అజిత్, సూర్యలతో తమిళనాడు బీజేపీ విభాగం గతంలో వాగ్వాదాలకు దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర నీట్ సెలక్షన్ విధానం వల్ల తమిళనాడు పేద విద్యార్థులు నష్టపోతారని సూర్య ఎప్పట్నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే తాజా సినిమాటోగ్రఫీ బిల్లు మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో సూర్య మీద తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమిళనాడు బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం తాజాగా ఒక సమావేశం నిర్వహించింది. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్తం సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సమావేశం అనంతరం తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు. సూర్య తన సినిమా గురించి మాత్రమే పట్టించుకోవాలని సూచించారు. సూర్య ఇదే రీతిలో కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారానికి పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఈ హెచ్చరికలకు సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.