Coronavirus: 15 ఏండ్ల‌లోపు పిల్ల‌ల‌కు కరోనా వ్యాక్సిన్‌.. నిపుణుల అభిప్రాయం తీసుకుంటాం: ఆరోగ్య మంత్రి

Coronavirus: 15 ఏండ్ల‌లోపు పిల్ల‌ల‌కు కరోనా వ్యాక్సిన్ అందించే విష‌యంలో నిపుణుల అభిప్రాయం తీసుకుంటామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ముందుగా ఏ వయస్సు వారికి ఇవ్వాలనే దానిపై సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందనీ, తదనుగుణంగా 15-18 ఏండ్ల‌ వయస్సు వారికి టీకాలు వేయడం జరుగుతోందని పేర్కొన్నారు. 
 

Will Take Experts View On Vaccination For Children Under 15: Health Minister

Coronavirus: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉంది. అయితే, గ‌త వారం నుంచి కొత్త కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ.. మ‌ర‌ణాలు క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. మ‌రీ ముఖ్యంగా కోవిడ్ (Coronavirus) టీకాలు అందికోని వారిపై ప్ర‌భావం అధికంగా ఉంటున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 15 ఏండ్ల‌లోపు పిల్ల‌ల‌కు టీకాలు అందించే విష‌యంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ మ‌రోసారి స్పందించారు. క‌రోనా ప్ర‌భావం కాస్త త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో పాఠశాలలను పునఃప్రారంభించడంతో 15 ఏళ్లలోపు పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నిపుణుల బృందం సూచనల ఆధారంగా ఈ బృందానికి టీకాలు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మన్సుఖ్ మాండవియా  మంగళవారం రాజ్యసభలో తెలిపారు.

కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ముందుగా ఏ వయస్సు వారికి ఇవ్వాలనే దానిపై సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందనీ, తదనుగుణంగా 15-18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు వేయడం జరుగుతోందని  తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, వివిధ వ‌య‌స్సు గ్రూపుల వారికి అందిస్తున్న ప‌రిస్థితుల‌పై పార్ల‌మెంట్ లో ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న పై వివ‌రాల‌ను వెల్ల‌డించారు. "15-18 సంవ‌త్స‌రాల‌ మధ్య వయసున్న వారిలో 67 శాతం మందికి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ వేయించారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను త్వరితగతిన అమలు చేస్తున్నారు. నిపుణుల సూచ‌న‌ల ఆధారంగా భవిష్యత్‌ నిర్ణయం (15 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడానికి) తీసుకోనున్నాము" అని తెలిపారు. నిపుణుల బృందం క్రమం తప్పకుండా సమావేశమై సూచనలు అంద‌జేస్తున్న‌ద‌నీ, దాని ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో, 15 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ వేయకపోవడంతో చిన్నారులపై కరోనా వైరస్‌ (Coronavirus) ఒమిక్రాన్‌ ముప్పు స్థాయిపై బీజేపీ సభ్యుడు సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అలాగే, కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రభావంపై బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేష్ వేసిన మరో ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. "భారతదేశనికి చెందిన‌ ICMR మాత్రమే కాకుండా ప్రపంచ శాస్త్రీయ సంస్థలు వ్యాక్సినేషన్ మరణాల రేటు మరియు ఆస్పత్రిలో చేరే రేటును తగ్గించడంలో సహాయపడతాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.  దేశంలో 97.5 శాతం మంది అర్హులైన లబ్ధిదారులు మొదటి డోస్ టీకాను పొందారు.  వారిలో 77 శాతం మంది రెండవ డోస్ అందుకున్నారు" అని వెల్ల‌డించారు. 

"అభివృద్ధి చెందిన దేశాలలో, 90 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తమ మొదటి మోతాదును పొందలేదు. అయితే, భారతదేశం  దానిని సాధ్యం చేసింది. మేము COVID-19 సంక్షోభాన్ని మెరుగ్గా నిర్వ‌హిస్తున్నాం" అని ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ తెలిపారు. భారీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా భార‌త్ క‌రోనా (Coronavirus) థ‌ర్డ్ వేవ్ ను అధిగ‌మించింద‌ని కూడా పేర్కొన్నారు.  రెండు రోజుల క్రితం విడుదల చేసిన ICMR అధ్యయనం ప్రకారం.. కోవిడ్-19 బారిన పడిన 99.3 శాతం మంది టీకాలు వేసినందున వారు సురక్షితంగా ఉన్నారనీ, ఇది మంచి సూచన అని ఆయన అన్నారు. వైవిధ్యం, భారీ జనాభా ఉన్నప్పటికీ COVID-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios