UP Assembly Election 2022: భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న సెక్షన్ల కంటే సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్యపై ఉన్న కేసుల సంఖ్యే ఎక్కువగా ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన హోరాహోరీ పోరు అధికార బీజేపీ (BJP),సమాజ్‌వాది పార్టీ (SP)ల మధ్య నిలకొన్నట్టు తెలుస్తోంది. ఈ సారి అనూహ్యంగా సీఎం యోగి ఆదిత్యనాథ్, అటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నేరుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే.. ఇరు పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా .. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ల కంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రిపై ఎక్కువ అభియోగాలు ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఎవరైనా పిటిషన్‌ను దాఖలు చేస్తే, కేసులను పునః పరిశీలిస్తామని అఖిలేశ్ సంచలన ప్రకటన చేశారు.
యూపీ ప్రజలు ఈ ఎన్నికల్లో నెగెటివ్‌గా ఆలోచించే వారిని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారని, యూపీ రాష్ట్రవ్యాప్తంగా ఇదే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూపీలో జరుగుతున్న ఎన్నికలు సోదరభావానికీ, బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అఖిలేశ్ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే.. పోలీసు వాహనాల సంఖ్యను రెట్టింపు చేస్తామని, తద్వారా వీలైనంత త్వరగా నేరస్థులకు చేరుకోవచ్చని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ఇక మార్చి 10 తర్వాత అఖిలేశ్‌లో వున్న వేడిని శాంతింపజేస్తామన్న సీఎం యోగి వ్యాఖ్యలకు అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. వేడి లేకపోతే మనుషులు చనిపోతారని, శరీరంలో వేడి రక్తం ప్రవహించడం ఆగిపోతే… ఎలా బతుకుతాం? అంటూ అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు.
SP-RLD (రాష్ట్రీయ లోక్‌దళ్) కూటమిపై యోగి ఆదిత్యనాథ్ చేసిన "గర్మీ శాంత్ కర్వా డెంగే [వేడిని తగ్గించుకుంటాడు]" అనే వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్‌పై కూడా విమర్శలు గుప్పించారు. "జిస్ దిన్ గర్మీ ఖతం హో జాయేగీ తో హమ్ లోగ్ మర్ జాయేంగే. అగర్ గర్మ్ ఖూన్ నహీ బహా తో హమ్ జిందా కైసే రహేంగే? [వేడి లేకపోతే చస్తాం. వేడి రక్తం ప్రవహించకపోతే ఎలా సజీవంగా ఉందా?]."SP-RLD కూటమికి ప్రజల మద్దతు లభించినందున, బిజెపికి భయం పట్టుకుందని ఆయన అన్నారు.
