అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు చేరుకొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని మోడీ సోమవారం నాడు ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు.

Also read:ట్రంప్ కి ఓన్లీ వెజ్! అల్పాహారం లో ఖమన్... ఈ వంటకం ప్రత్యేకతేమిటి?

 రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఇండియా పర్యటనకు సోమవారం నాడు రానున్నారు. మరికొద్ది గంటల్లోనే మిమ్మల్ని కలుసుకొంటాను అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. మిమ్మల్ని కొన్ని గంటల్లో కలుస్తాను అంటూ ట్రంప్ హిందీలో ట్వీట్ చేశారు.  

 

ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు మోడీ సోమవారం నాడు ఉదయమే అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు.  ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకోవడానికి కొద్ది గంటల ముందే మోడీ  అహ్మదాబాద్‌కు చేరుకొన్నారు. మోడీకి గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు స్థానిక బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.