Asianet News TeluguAsianet News Telugu

నా భర్తను ముద్దుపెట్టుకుంటా.. మీరు ఆపగలరా..?

 ఈ నేపథ్యంలో.. కరోనాని కట్టడి చేసేందుకు వీకెండ్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా.. కారులో వెళ్తున్న సమయంలోనూ మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
 

Will Kiss Husband": Delhi Couple Misbehaves With Cops Over Curfew Check
Author
Hyderabad, First Published Apr 19, 2021, 8:26 AM IST

నా భర్తను నేను ముద్దుపెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా..? అంటూ ఓ మహిళ ఏకంగా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. కరోనా రూల్స్ పాటించమని అడిగినందుకు ఆమె ఇలా రాద్దాంతం చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. కరోనాని కట్టడి చేసేందుకు వీకెండ్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా.. కారులో వెళ్తున్న సమయంలోనూ మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

నా భర్తను నేను ముద్దుపెట్టుకుంటాను.. మీరు నన్ను ఆపగలరా..? అంటూ ఓ మహిళ ఏకంగా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. కరోనా రూల్స్ పాటించమని అడిగినందుకు ఆమె ఇలా రాద్దాంతం చేయడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే...దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. కరోనాని కట్టడి చేసేందుకు వీకెండ్ కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా.. కారులో వెళ్తున్న సమయంలోనూ మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కాగా.. ఈ నియమాలను పాటించకుండా ఓ జంట ఢిల్లీ రోడ్లపై కారులో తిరుగుతున్నారు. వారు మాస్క్ ధరించి లేకపోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా.. కనీసం మాస్క్ ధరించకుండా.. వారు అలా బయటకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. సదరు జంట రివర్స్ లో పోలీసులతో వాదించడం గమనార్హం. సదరు వివాహిత.. ఏకంగా తాను తన భర్తను రోడ్డుపైనే ముద్దు పెట్టుకోగలనని.. మీరు మమ్మల్ని ఆపగలరా అంటూ ప్రశ్నించడం గమనార్హం. కారు ఎందుకు ఆపారంటూ వాదనలాడారు. ‘‘నేను నా భార్యతో కారులో వెళ్తుంటే.. మీరు ఎందుకు ఆపారు’’ అని సదరు వ్యక్తి పోలీసులను ప్రశ్నించాడు. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. కారులో కూడా మాస్క్ తప్పనిసరి అంటూ చెప్పినా వినిపించుకోకపోగా.. కావాలంటే తమపై కేసు పెట్టుకోమని సవాలు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులతో వాదించిన సదరు వ్యక్తి పంకజ్ దత్తాను పోలీసులు అరెస్టు చేయగా.. అతని భార్య అభా గుప్తాని కూడా త్వరలోనే అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు.

కాగా.. ఈ నియమాలను పాటించకుండా ఓ జంట ఢిల్లీ రోడ్లపై కారులో తిరుగుతున్నారు. వారు మాస్క్ ధరించి లేకపోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. వీకెండ్ కర్ఫ్యూ సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా.. కనీసం మాస్క్ ధరించకుండా.. వారు అలా బయటకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

అయితే.. సదరు జంట రివర్స్ లో పోలీసులతో వాదించడం గమనార్హం. సదరు వివాహిత.. ఏకంగా తాను తన భర్తను రోడ్డుపైనే ముద్దు పెట్టుకోగలనని.. మీరు మమ్మల్ని ఆపగలరా అంటూ ప్రశ్నించడం గమనార్హం. 

కారు ఎందుకు ఆపారంటూ వాదనలాడారు. ‘‘నేను నా భార్యతో కారులో వెళ్తుంటే.. మీరు ఎందుకు ఆపారు’’ అని సదరు వ్యక్తి పోలీసులను ప్రశ్నించాడు. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. కారులో కూడా మాస్క్ తప్పనిసరి అంటూ చెప్పినా వినిపించుకోకపోగా.. కావాలంటే తమపై కేసు పెట్టుకోమని సవాలు  చేయడం విశేషం.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పోలీసులతో వాదించిన సదరు వ్యక్తి పంకజ్ దత్తాను పోలీసులు అరెస్టు చేయగా.. అతని భార్య అభా గుప్తాని కూడా త్వరలోనే అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios