న్యూఢిల్లీ: ఈ నెల 30వ తేదీన రైతులతో చర్చించనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

రైతు సంఘాలు ప్రతిపాదించిన దాని కంటే ఒక రోజు తర్వాత డిసెంబర్ 30వ తేదీన వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి రైతుల డిమాండ్లపై చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ రైతు సంఘాలకు రాసిన లేఖలో ఈ నెల 30వ తేదీన చర్చలకు  సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు రైతుల డిమాండ్లపై రైతు సంఘాల నేతలతో  కేంద్ర ప్రభుత్వం  చర్చించనుంది.

రైతు సంఘాలు డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరింది. నాలుగు ప్రధాన విషయాలను కూడ రైతు సంఘాలు లేఖలో కోరారు.