హిజాబ్ అంశాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ: Hijabఅంశాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని Supreme Court చీఫ్ జస్టిస్ NV Ramana అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో ఈ పిటిషన్ ను విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. Schools,College హిజాబ్ ఆంక్షలకు సంబంధించిన విషయమై నిర్ణయం తీసుకొనే వరకు మతపరమైన దుస్తులు ధరించవద్దని Karnataka High Court గురువారం నాడు తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు
పిటిషనర్. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ కేసును అత్యవసరంగా విచారణగా చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ కేసుపై అత్యవసర విచారణను తిరస్కరించింది సుప్రీంకోర్టు. అయితే ఈ విషయమై కర్ణాటక హైకోర్టు నిర్ణయం ముందుగా తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ కు సూచించింది.
ఈ సమస్యను ఢిల్లీకి తీసుకు రావొద్దని, జాతీయ సమస్యగా కూడా మార్చొద్దని సుప్రీంకోర్టు పిటిషనర్ కు హితవు పలికింది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పిటిషనర్ తరపు న్యాయవాది కామత్ తన వాదనలను విన్పించారు. ఆర్టికల్ 25 ప్రమాదంలో ఉందని భారత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో చెప్పారు. కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారిస్తోందని సీజేఐ చెప్పారు. ఇంకా ఆర్డర్ రాని విషయాన్ని కూడా సీజేఐ గుర్తు చేశారు.ఈ విషయాలను ఢిల్లీకి, జాతీయ స్థాయికి తీసుకురావడం సరైందేనా ... ఏదైనా తప్పు ఉంటే తాము రక్షిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు గురువారం నాడు మధ్యంతర తీర్పు వెలువరించింది. కళాశాలల్లో విద్యార్థులు 'హిజాబ్' ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. అయితే వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించాలని పట్టుబట్టకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం విచారణను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది కోర్ట్.
పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ సంజయ్ హెగ్డే వాదనలు వినిపించారు. కర్ణాటక విద్యా చట్టంలో యూనిఫామ్‌పై ప్రత్యేక నిబంధనలేవీ లేవని తెలిపారు. మునుపటి రోజుల్లో యూనిఫామ్ అనేది పాఠశాలలో ఎక్కువగా ఉండేదని గుర్తు చేశారు. కాలేజ్‌లకు యూనిఫామ్ చాలా కాలం తరువాత వచ్చాయని అన్నారు. తాను యూనివర్శిటీలో చదివే రోజులలో యూనిఫామ్ లేదని చెప్పారుహిజాబ్ వివాదంపై కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. శివమొగ్గ జిల్లాలో ఏకంగా 144 సెక్షన్ కూడా విధించారు. కాలేజీల వద్ద విద్యార్ధులు రెండు వర్గాలుగా ఏర్పడి ఆందోళనలకు దిగారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా సంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కర్ణాటక ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.
