Asianet News TeluguAsianet News Telugu

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మారనున్నాయా? సంచలన సమాధానమిచ్చిన విదేశాంగ మంత్రి జైశంకర్‌

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు ఉండబోవని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సీమాంతర ఉగ్రవాదానికి గట్టి సందేశం ఇచ్చారు. ఆసియా కప్ 2023 కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లదని బీసీసీఐ ఆలస్యంగా చెప్పింది. ఇదంతా బీసీసీఐ, పీసీబీల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది

Will cricket ties change between India, Pakistan? What foreign minister Jaishankar said
Author
First Published Dec 10, 2022, 10:36 AM IST

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ చేస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి గట్టి సందేశం ఇచ్చారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఆసియా కప్ 2023 కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లదని బీసీసీఐ తాజాగా చెప్పింది. ఇదంతా బీసీసీఐ, పీసీబీల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

వివరాల్లోకెళ్తే.. అజెండా ఆజ్ తక్‌లో అనే కార్యక్రమంలో  విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు. భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం, ఉగ్రవాదం, దౌత్యసంబంధాలపై మాట్లాడారు. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మారనున్నాయా? ప్రశ్నించగా విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇలా సమాధానమిచ్చారు. "టోర్నమెంట్‌లు వస్తూనే ఉంటాయి. మీకు ప్రభుత్వ వైఖరి గురించి తెలుసు. ఏమి జరుగుతుందో చూద్దాం. ఇది సంక్లిష్టమైన సమస్య. నేను మీ తలపై తుపాకీ పెడితే.. మీరు నాతో మాట్లాడతారా? మీ పొరుగువారు బహిరంగంగా ఉగ్రవాదానికి సహాయం చేస్తే.. నాయకులు ఎవరు, శిబిరాలు ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి తెలిస్తే ఎలా ఉంటుంది? సీమాంతర ఉగ్రవాదం సాధారణమని మనం ఎప్పుడూ అనుకోకూడదు. పొరుగువారు మరొకరిపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారడానికి ఇదొక ఉదాహరణ. ఉగ్రవాదం అసాధారణమైన చర్యకాదు" అని జైశంకర్ అన్నారు.


“క్రికెట్‌పై మా స్టాండ్ మీకు తెలుసు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే హక్కు ఒక దేశానికి ఉందని మనం ఎన్నటికీ అంగీకరించకూడదు. మేము దీనిని చట్టవిరుద్ధం చేయకపోతే.. ఇది కొనసాగుతుంది. కాబట్టి పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. తీవ్రవాద బాధితులు స్వరం వినిపించకపోతే.. ఒత్తిడి రాదు. మన రక్తం చిందినందున భారతదేశం ఒక విధంగా దారి చూపాలి” అని EAM S జైశంకర్ అన్నారు. ఒకవేళ భారత్ ఆసియా కప్ నుండి వైదొలగాలని ఎంచుకుంటే.. ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ కూడా భారత్‌కు వెళ్లదని కూడా రమీజ్ రాజా బెదిరించారు. ఈ ప్రకటనలన్నీ భారత ప్రభుత్వం, BCCI ఒకే అభిప్రాయంతో ఉన్నాయని స్పష్టమైన సూచన. అందువల్ల, 2023 ఆసియా కప్‌లో పాల్గొనేందుకు వారు భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు పంపే అవకాశం లేదు.  

ఈ నెల ప్రారంభంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. భారత జట్టు తమ దేశానికి వెళ్లనందున టోర్నమెంట్ ఆతిథ్య హక్కులను ఉపసంహరించుకుంటే పాకిస్తాన్ ఆసియా కప్ 2023 నుండి వైదొలగాలని పరిగణించవచ్చని అన్నారు. అక్టోబర్‌లో.. BCCI సెక్రటరీ జే షా మాట్లాడుతూ..  ఈ ఈవెంట్ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళుతుందనే ఊహాగానాలను పూర్తిగా తోసిపుచ్చారు. ఆసియా కప్ తటస్థ వేదికపై జరుగుతుందని చెప్పారు. ఈ రెండు జట్లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి.

Follow Us:
Download App:
  • android
  • ios