Asianet News TeluguAsianet News Telugu

అన్నాడీఎంకేకు పూర్వ వైభవం తెస్తా.. 16 మంది బహిష్కృత నేతలతో శశికళ వ్యాఖ్యలు, ఆడియో వైరల్

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు ప్రకటించిన శశికళకు మళ్లీ పొలిటిక్స్‌పై మనసు మళ్లీనట్లుగా తెలుస్తోంది. కొద్దిరోజుల నుంచి ఆమె రాజకీయాలపై కామెంట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకేకు పూర్వ వైభవం తెస్తానంటూ వ్యాఖ్యానించారు

Will Come And Set AIADMK Straight VK Sasikala In Purported Audio Clip ksp
Author
chennai, First Published Jun 15, 2021, 2:52 PM IST

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లు ప్రకటించిన శశికళకు మళ్లీ పొలిటిక్స్‌పై మనసు మళ్లీనట్లుగా తెలుస్తోంది. కొద్దిరోజుల నుంచి ఆమె రాజకీయాలపై కామెంట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకేకు పూర్వ వైభవం తెస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని తన మద్దతుదారులకు ఆమె భరోసానిచ్చారు. శశికళతో మాట్లాడుతున్నారన్న కారణంగా 16 మంది నేతలపై పార్టీ అధిష్ఠానం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారితో చిన్నమ్మ మాట్లాడి ధైర్యం చెప్పారు.

గుబేంద్రన్ అనే పార్టీ నేతతో శశికళ ఫోన్ లో మాట్లాడారు. ఆ సంభాషణకు చెందిన ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. తననెవరూ ఆపలేరని, పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని ఆయనకు చిన్నమ్మ చెప్పారు. పార్టీ మొత్తాన్ని కేవలం మాజీ సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకే ఎందుకు అప్పగించారని గుబేంద్రన్ ప్రశ్నించగా.. తాను కేవలం కార్యకర్తలకే పార్టీని అప్పగించానని శశికళ బదులిచ్చారు. ఒకప్పుడు కార్యకర్తల బలంతోనే పార్టీ వైభవోపేతంగా సాగిందని ఆమె గుర్తుచేశారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని, సమస్యలను పరిష్కరిస్తానని శశికళ హామీ ఇచ్చారు.  

Also Read:మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి శశికళ?: సోషల్ మీడియాలో ఆడియో వైరల్

అయితే, మళ్లీ పార్టీని గుప్పిట్లో పెట్టుకునేందుకే రాజకీయ పున:ప్రవేశం చేస్తానంటూ శశికళ ప్రకటనలు చేస్తున్నారని మాజీ సీఎం పళనిస్వామి, అన్నాడీఎంకే అగ్రనేత పన్నీర్ సెల్వం సోమవారం సంయుక్త ప్రకటన చేశారు. ఆమెతో ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు

Follow Us:
Download App:
  • android
  • ios