Asianet News TeluguAsianet News Telugu

మాస్కుతో మోడీ దర్శనం: 24 గంటలు అందుబాటులో ఉంటానంటూ సీఎంలకు అభయం

లాక్ డౌన్ పొడిగింపుపై పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రధాని మోడీ గారు నేటి ఉదయం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

Will be Available 24x7: PM Modi Tells Chief Ministers On Coronavirus Crisis
Author
New Delhi, First Published Apr 11, 2020, 12:31 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మందులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.... హెచ్ఐవి మందులను ఇతరాత్రాలను కలిపి ఇస్తున్నారు. అంతే తప్ప.. ఈ వైరస్ కి అయితే ఇప్పటికింకా మందు రాలేదు.  

మందు లేదు వాక్సిన్ కి కూడా ఇంకా ఒక సంవత్సరం సమయం పడుతుందని తేలిన నేపథ్యంలో ప్రపంచమంతా లాక్ డౌన్ నే ఆశ్రయిస్తున్నాయి. అన్ని దేశాల బాటలోనే భారతదేశం కూడా లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

గత నెల 24వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 14వ తేదీ వరకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ పై దేశమంతా వివిధ వాదనలు వినపడుతున్నాయి 

ఈ నేపథ్యంలో ఈ లాక్ డౌన్ పొడిగింపుపై పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రధాని మోడీ గారు నేటి ఉదయం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాస్కు ధరించి కనిపించరు. ఇప్పటికే గత వీడియో కాన్ఫెరెన్క్యూల్లో సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ వస్తున్న ప్రధాని మోడీ ఇప్పుడు తాజాగా మాస్కు ధరించారు. జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ మాస్క్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని తెలిపారు.

ఇప్పటికే దేశంలోని చాలా నగరాల్లో మాస్కులను ధరించడం తప్పనిసరి చేసారు. ఢిల్లీ, ముంబై, పూణే సహా ఇతర నగరాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి చేసారు. తాజాగా తెలంగాణలో రాష్ట్రమంతా మాస్కును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. 

ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో లాక్ డౌన్ పొడగింపు విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల  కోరారు మోడీ, తాను 24x7 ముఖ్యమంత్రులకు అందుబాటులో ఉంటానై, ఈ కరోనా పై పోరులో ఎవరు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా, ఎవరు తనకు సలహా ఇవ్వాలనుకున్నా తాను అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా తనకు ఫోన్ చేయొచ్చని తెలిపారు. 

ప్రధాని మాస్కు ధరించడంతో ప్రజలందరికీ మాస్కు ధరించమని ఒక మెసేజ్ ముని ఇచ్చారు మోడీ. తాను పాటించి ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాలని భావించారు మోడీ. దాన్నే ఆచరణలో పెట్టారు. తాను పాటించి ప్రజలను కోరినప్పుడు ప్రజలంతా కూడా దాన్ని పాటించే ఆస్కారం అధికంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios