దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కార్చిచ్చు రాజుకుంది. ఉత్తర ముంబయిలోని గోరేగావ్‌కు సమీపంలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని అటవీ ప్రాంతంలో మంటలు రేగాయి. పార్క్‌కు అనుకుని ఉన్న ఆరే-కాలనీకి సమీపాన గల ఐటీపార్క్‌కు దగ్గరల్లో ఉన్న దట్టమైన అడవి వుంది.

ఫిల్మ్‌సిటికి సమీపంలో ఉన్న హబల్‌పడ పర్వతాలపై ముందుగా కార్చిచ్చును గమనించారు. సోమవారం సాయంత్రానికి సుమారు 4 కి.మీ విస్తీర్ణంలో అటవీప్రాంతం దగ్థమైంది. ఈ జాతీయ ఉద్యానవనంలో అరుదైన జంతు జాలంతో పాటు చిరుతలు, నెమళ్లు, దుప్పులు, అడవి పందులు ఎక్కువగా జీవిస్తున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు.. వందల కొద్ది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.