Asianet News TeluguAsianet News Telugu

బైకర్ హత్యకేసులో షాకింగ్ నిజాలు.. భార్యే, స్నేహితులతో కలిసి భర్తను హతమార్చింది..!!

ఈ హత్య కేసు(Murder Case)లో సాక్షాత్తు బైకర్ మోన్ భార్య (wife)తో, పాటు అతని స్నేహితుల(friends) హస్తముందని రాజస్థాన్ పోలీసులు తేల్చారు. మోటార్ స్పోర్ట్స్  ఈవెంట్ కు  ముందు ఎడారిలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోన్ 2018 ఆగస్టు 16న మరణించాడని పోలీసులు తెలిపారు.

Wife two friends colluded to murder Kerala biker found dead in Jaisalmer: Cops after 3-year probe
Author
Hyderabad, First Published Sep 30, 2021, 9:30 AM IST

రాజస్థాన్ రాష్ట్రంలోని  జైసల్మేర్ (Jaisalmer)ఎడారిలో మూడేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన బైకర్ ((Kerala Biker) )అస్బక్ మోన్ (Asbak Mon)కేసులో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. ఇండియా- బాజా  మోటార్ స్పోర్ట్స్  ర్యాలీకి ముందు  2018 ఆగస్టు 16వ తేదీన జైసల్మేర్ లోని ఎడారిలో 34 ఏళ్ల బైకర్ మోన్  ప్రాక్టీస్ సమయంలో అనుమానాస్పద స్థితిలో (mysterious death) మరణించాడు. 

ఈ హత్య కేసు(Murder Case)లో సాక్షాత్తు బైకర్ మోన్ భార్య (wife)తో, పాటు అతని స్నేహితుల(friends) హస్తముందని రాజస్థాన్ పోలీసులు తేల్చారు. మోటార్ స్పోర్ట్స్  ఈవెంట్ కు  ముందు ఎడారిలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మోన్ 2018 ఆగస్టు 16న మరణించాడని పోలీసులు తెలిపారు.

ఎడారిలో దారి తప్పిపోయి, డీహైడ్రేషన్ తో మరణించాడని మొదట పోలీసులు భావించారు.  ఈ మేరకు కేసును మూసివేశారు. కాగా,  జైసల్మేర్ ఎస్పి  అజయ్ సింగ్  పాత కేసులను పరిశీలిస్తూ  బైకర్ మరణంలో వ్యత్యాసం కనిపించడంతో తిరిగి కేసు తెరిచి దర్యాప్తు చేయించారు. 

ఎడారిలో తప్పిపోయిన భర్త అస్బక్ మోన్ ను భార్య సుమేరా పర్వేజ్, అతని స్నేహితులు వెతక లేదని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో పాటు బైకర్ భార్య సుమేరాతో అతని స్నేహితుల ఫోన్ కాల్ రికార్డులు, వారి ప్రవర్తన ఆధారంగా బైకర్ ది హత్య అని పోలీసులు అనుమానించి దర్యాప్తు చేయగా..అసలు విషయం వెలుగు చూసింది.

బైక్ రేసులో కిందపడి బైకర్ మృతి.. రెండేళ్ల తరువాత షాకింగ్ నిజాలు వెలుగులోకి..

బైక్ భార్య సుమేరా, మోన్ స్నేహితులు  సంజయ్,   విశ్వాస్ లు  కలిసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు సంజయ్, విశ్వాస్ లను అరెస్టు చేశారు. సుమేరా పర్వేజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్య కేసులో ఈ ముగ్గురితో పాటు సాబిక్, నీరజ్, సంతోష్ లు ఉన్నారని వారి కోసం కూడా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

కాగా, బెంగళూరుకు చెందిన అస్బక్ మోన్ అనే వ్యక్తికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోటీలు నిర్వహించిన తప్పక పాల్గొనేవాడు.  2018 లో రాజస్థాన్ లోని జైసల్మీర్ లో బైక్ రేసింగ్ పోటీలు ఉన్నాయంటే వెళ్లాడు.  కానీ ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయి మరణించాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అస్బక్ భార్య, తండ్రి బెంగళూరు నుంచి జైసల్మేర్ కు వచ్చారు.  అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, దహనసంస్కారాలు పూర్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios