Asianet News TeluguAsianet News Telugu

కొడుకు, ప్రియుడితో కలిసి.. రెండో భర్తను దారుణంగా చంపిన భార్య.. ఢిల్లీలో ఘాతుకం...

మే 10న నోయిడాలో జరిగిన సూపర్ వైజర్ హత్య కేసును ఎట్టకేలకూ పోలీసులు చేధించారు. రెండో భార్యే ఆస్తికోసం.. కొడుకు, ప్రియుడితో కలిసి.. హత్య చేయించినట్లు తేలింది. 

Wife Plotted Noida Supervisor's Killing With Son, Her Lover For Property says Police
Author
Hyderabad, First Published May 16, 2022, 9:29 AM IST


నోయిడా : ఐదు రోజుల క్రితం నగర రహదారిపై గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో హత్యకు గురైన ప్రైవేట్ సంస్థ సూపర్‌వైజర్ murder కేసు మిస్టరీని ఛేదించినట్లు నోయిడా పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో కేసు కొలిక్కి వచ్చినట్టు తెలిపారు. సూపర్‌వైజర్ భార్య, ఆమెకు మొదటి భర్తతో పుట్టిన కొడుకు, ప్రస్తుత ప్రేమికుడు నిందితులుగా పోలీసులు తేల్చారు. 

సూపర్ వైజర్ చనిపోతే అతని ఆస్తిని లాక్కోవొచ్చనే దురాశతో హత్యకు పథకం పన్నారని కూడా పోలీసులు పేర్కొన్నారు. దీనికోసం ఒక ప్రొఫెషనల్ షార్ప్ షూటర్‌ని కూడా మహిళ ప్రేమికుడు నియమించుకున్నాడు. మే 10వ తేదీ మధ్యాహ్నం ఓఖ్లా బర్డ్ శాంక్చురీ మెట్రో స్టేషన్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో సూపర్‌వైజర్ రిషిపాల్ శర్మను లక్ష్యంగా చేసుకుని షార్ప్‌షూటర్ కాల్పులు జరిపాడు. ఈ సమయంలో మోటారు సైకిల్‌పై సదరు మహిళ కొడుకుతో కలిసి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీలో నివసించే శర్మ ఉద్యోగం ముగించుకుని ఇంటికి స్కూటర్‌పై వెళుతుండగా, సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో కాల్పులు జరిపి, దుండగులు వెంటనే పారిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) రణవిజయ్ సింగ్ తెలిపారు.

"మే 10న, మోటారుసైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు శర్మపై కాల్పులు జరిపారు. ఇది గమనించిన స్థానికులు పోలీసుకులు సమాచారం అందించడంతో అతన్ని మొదట ఇక్కడ సెక్టార్ 30లోని నిథారీ ప్రాంతంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చికిత్స పొందుతూ శనివారం మరణించాడు" అని సింగ్ అన్నారు.

''కేసు విచారణలో అతనికి పూజా సింగ్‌ అనే మహిళతో పెళ్లయిందని.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి అని.. పూజకు మొదటి పెళ్లిలో విశాల్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడని తేలింది. అంతేకాదు పెళ్లినాటికే ఆమెకు అఖిల్ అనే ప్రేమికుడు కూడా ఉన్నాడు. శర్మ ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ముగ్గురూ కలిసి హత్యకు కుట్ర పన్నారు.

తమ ప్రణాళికలో భాగంగా అఖిల్ షార్ప్ షూటర్ మెహందీ హసన్‌ను నియమించుకున్నాడని అధికారి తెలిపారు. విశాల్, మెహందీ హసన్ అఖిల్ మోటార్ సైకిల్ తీసుకొని శర్మపై దాడి చేశారు, అతనికి ప్రాణాపాయం కలిగించారు. వారు గుర్తించబడకుండా ఉండటానికి మోటార్‌సైకిల్ నంబర్ ప్లేట్‌పై మట్టిని వేశారు. శర్మ, అతని భార్య మీను కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్నారని, ఆ తర్వాత అతను పూజను రెండో వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారు.

పూజా ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తుంది. అక్కడ అఖిల్ భార్య అనారోగ్యంతో అడ్మిట్ అయింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధంలోకి వెళ్లిందని వారు చెప్పారు. విచారణ సందర్భంగా, పోలీసులకు నోయిడాలో శర్మకు చాలా "ఆస్తి" ఉందని పూజ ద్వారా తనకు తెలిసిందని, అతని ఆస్తులలో కొంత భాగాన్ని విక్రయించమని భర్తను బలవంతం చేయడంతో ఆమె దానిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు అఖిల్ చెప్పాడని అధికారులు తెలిపారు.

అఖిల్, విశాల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, నేరానికి ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నేరం సమయంలో ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ సింగ్ తెలిపారు. భార్య, షార్ప్‌షూటర్ పరారీలో ఉన్నారని.. వారిని అరెస్టు చేయడానికి.. అనుమానిత ప్రాంతాలన్నింటోనూ సోదాలు జరుగుతున్నాయని, ఈ కేసులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా చట్టపరమైన చర్యలు త్వరలో పూర్తవుతాయని అధికారి తెలిపారు.

సెక్టార్ 126 పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 302 (హత్య), 34 (అనేక మంది వ్యక్తులు ఉమ్మడి ఉద్దేశ్యంతో చేసిన నేరపూరిత చర్య), 120 బి (నేరపూరిత కుట్రకు పార్టీ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios