Asianet News TeluguAsianet News Telugu

అనాగరికం: భార్యలను అద్దెకిస్తున్న భర్తలు, ఎందుకంటే?

 దేశంలోని పలు రాష్ట్రాల్లో  భార్యను అద్దెకు  ఇచ్చే  పరిస్థితులు  ఉన్నాయి. కొన్ని చోట్ల సంప్రదాయాల పేరుతో ఈ అనాగరికం చోటు చేసుకొంటే, మరికొన్ని చోట్ల మాత్రం పెళ్లి చేసుకొనేందుకు అమ్మాయిలు దొరకని కారణంగా భార్యలను అద్దెకు ఇస్తున్నారు

WIFE ON RENT! Did You Know It's A Culture In Some Parts Of in India?
Author
New Delhi, First Published Sep 2, 2018, 12:15 PM IST

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో  భార్యను అద్దెకు  ఇచ్చే  పరిస్థితులు  ఉన్నాయి. కొన్ని చోట్ల సంప్రదాయాల పేరుతో ఈ అనాగరికం చోటు చేసుకొంటే, మరికొన్ని చోట్ల మాత్రం పెళ్లి చేసుకొనేందుకు అమ్మాయిలు దొరకని కారణంగా భార్యలను అద్దెకు ఇస్తున్నారు. కాంట్రాక్టు పద్దతిలో భార్యలను  అద్దెకు ఇస్తున్న పరిస్థితుల పట్ల  స్వచ్ఛంధసంస్థలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని  మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లో  భార్యలను అద్దెకు ఇస్తున్న ఘటనలు  చాలా ఏళ్ల నుండి కొనసాగుతున్నాయి.ఆడపిల్లలను కనడం ఇష్టం లేకపోవడం, వంశాన్ని  కొడుకు పెంచి పోషించేవాడనే కారణంగానే అమ్మాయిలను పురిట్లోనే చంపేస్తున్న కారణంగా కూడ భార్యలను అదెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడ లేకపోలేదు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివ్‌పురి జిల్లాలోని కొన్ని గ్రామాల్లోని ఉన్నత కులాల్లోని అబ్బాయిలు పెళ్లి చేసుకొనేందుకు అమ్మాయిలు దొరకడం లేదు.దీంతో  కాంట్రాక్టు పద్దతిలో భార్యలను అద్దెకు తెచ్చుకొనే పద్దతిని ఈ జిల్లాలో కొనసాగిస్తున్నారు.  'ధడీచప్రథ' అనే ఆచారం పేరుతో ఈ అనాగరికం సాగుతోంది.

ఈ జిల్లాలో  ధనికులైన  పురుషులు తమకు పెళ్లిళ్లు కావడం లేదనే ఉద్దేశ్యంతో తక్కువ కులానికి చెందిన  భార్యలను.. లేదా అమ్మాయిలను అద్దెకు తెచ్చుకొంటారు.  ఈ మేరకు  కాంట్రాక్టు కుదుర్చుకొంటారు.  నెల, సంవత్సరం  ఇలా కాంట్రాక్ట్ ను కుదుర్చుకొంటారు.   కొన్ని కులాల్లో  భర్తలే తమ భార్యలను ఉన్నత కులాలకు చెందిన యువకులను భార్యలుగా అద్దెకు ఇస్తుంటారు.

కాంట్రాక్టును  వంద రూపాయాల స్టాంప్ పేపర్‌పై  ఒప్పందం చేసుకొంటారు. కాంట్రాక్టు పూర్తైతే ఇరువర్గాలు తమ కాంట్రాక్టును పొడిగించుకోవచ్చు.. లేదా కాంట్రాక్టును రద్దు చేసుకోవచ్చు.  కాంట్రాక్టు కాలంలో కాంట్రాక్టు తీసుకొన్నభర్త చెప్పినట్టుగా ఆ భార్య నడుచుకోవాలి.  అద్దెకు తీసుకొనే యువకులు.. లేదా పురుషులు తమకు నచ్చిన వారిని  ఎంపిక చేసుకొనే వెసులు బాటు కూడ ఉంటుంది.

గుజరాత్ రాష్ట్రంలోని  రాజ్‌కోట్, గాంధీనగర్, మెహ్‌సానా, పాటణ్ , భరుచ్ ప్రాంతంలో ఉన్నాయి. భరుచ్ ప్రాంతంలో  గతంలో ఓ వ్యక్తి  తన  భార్యను  ఓ ఉన్నత వ్యక్తికి  అద్దెకు ఇవ్వడం గతంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

భార్యలను  అద్దెకు ఇవ్వడం అనే పద్దతి కొనసాగుతున్న తరుణంలో  కొందరు మధ్య దళారులు తీన్ని వ్యాపారంగా మార్చేసుకొన్నారు. పెద్ద ఎత్తున  అద్దె భార్యల  విక్రయంలో  మధ్య దళారులు కీలక పాత్ర పోషిస్తున్న సందర్భాలు చోటు చేసుకొంటున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios