Asianet News TeluguAsianet News Telugu

కశ్మీరీ పండిట్లను బలిపశువు చేస్తున్నారు.. కేంద్రంపై టెర్రరిస్టులు చంపిన కశ్మీర్ పండిట్ భార్య ఫైర్

జమ్ము కశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడిలో నిన్న కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ మరణించాడు. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కశ్మీరీ పండిట్లు నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో టెర్రరిస్టుల దాడిలో మరణించిన రాహుల్ భట్ భార్య మీడియాతో మాట్లాడారు. కశ్మీరీ పండిట్లను ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు.
 

wife of killed kashmiri pandit says they were being made as scapegoats for politics
Author
New Delhi, First Published May 13, 2022, 1:46 PM IST

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ బుడ్గాం జిల్లాలో గురువారం మధ్యాహ్నం టెర్రరిస్టులు కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌ను హతమార్చారు. రాహుల్ భట్ హత్యపై కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లు ఆందోళనలు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. చదూరాలో తన భర్త పని చేసేటప్పుడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యాడని వివరించారు. అందుకే తనను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేయాలని రాహుల్ భట్ పలుమార్లు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. పలుమార్లు చేసిన ఆయన విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోలేదని, ఆయనను బదిలీ చేయలేదని ఆవేదన చెందారు. 

రాహుల్ భట్ బుడ్గాం జిల్లాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా చేశారు. గురువారం మధ్యాహ్నం కొందరు టెర్రరిస్టులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఆయనకు తీవ్రంగా బుల్లెట్ గాయాలు అయ్యాయి. స్థానికులు రాహుల్ భట్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించారు. కానీ, అక్కడ హాస్పిటల్‌లో చేరిన స్వల్ప వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు. రాహుల్ భట్‌ను చంపింది తామేనని కశ్మీర్ టైగర్స్ అనే తీవ్రవాద గ్రూపు ప్రకటించుకుంది. 

ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు కశ్మీరీ పండిట్లను బలిపశువులను చేస్తున్నారని ఆమె విమర్శించారు. వారు తమ రాజకీయాల కోసం కశ్మీరీ పండిట్లను ఇంధనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే వారు కశ్మీర్ వచ్చి సెక్యూరిటీ లేకుండా తిరగాలని సవాల్ విసిరారు. కశ్మీర్ పండిట్లు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారని అన్నారు. కానీ, ఈ దేశం తమ బాధను చూస్తూ కూడా మౌనంగా ఉంటున్నదని ఆవేదన వ్యక్త పరిచారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కశ్మీర్ పండిట్లపై పూర్తిగా భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

తన భర్త ఆఫీసులో అందరూ సత్ప్రవర్తనతో ఉంటారని, ఆయనతో మంచిగా మసులుకుంటారని రాహుల్ భట్ చెప్పారని భార్య  మీనాక్షి భట్ వివరించారు. కానీ, ఆయనపై దాడి జరుగుతుంటే ఎవరూ కాపాడటానికి రాలేదు కూడా అని పేర్కొన్నారు. కానీ, రాహుల్ భట్ హత్యకు జరిగిన కుట్రలో ఆఫీసు ఉద్యోగులు కూడా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే.. ఆ టెర్రరిస్టులకు తన భర్త గురించి ఎలా తెలిసేదని పేర్కొన్నారు.

ఈ రోజు కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లు రాహుల్ భట్ హత్యకు నిరసనగా ప్రదర్శనలు చేశారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వ తీరును వ్యతిరకించారు. ఈ నిరసనకారులను చెదరగొట్టాడానికి పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీ చార్జ్ చేశారు. భాష్ప వాయువు ప్రయోగించారు.

ఈ నిరసనలో పాల్గొన్న కశ్మీర్ పండిట్ అపర్ణ పండిట్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించగలిగితే.. రాహుల్ భట్‌ను చంపేసిన టెర్రరిస్టులను నిన్న ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios