భర్త వీరమరణం పొందినా.. భార్య తన కర్తవ్యాన్ని మాత్రం వీడలేదు. యూనిఫాంలోనే అంత్యక్రియలకు హాజరై.. నివాళులర్పించింది. ఈ సంఘటన అక్కడివారందరినీ కలచివేసింది.

భర్త వీరమరణం పొందినా.. భార్య తన కర్తవ్యాన్ని మాత్రం వీడలేదు. యూనిఫాంలోనే అంత్యక్రియలకు హాజరై.. నివాళులర్పించింది. ఈ సంఘటన అక్కడివారందరినీ కలచివేసింది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... మ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఎంఐ-17 ఛాపర్‌ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధార్థ్‌ వశిష్ట్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో శుక్రవారం చండీగఢ్‌లో జరిగాయి. 

వశిష్ట్‌ భార్య ఆర్తీసింగ్‌ కూడా స్వాడ్రన్ లీడర్. దీంతో ఆమె భర్త అంత్యక్రియలకు ఆమె యూనిఫామ్‌తో హాజరై తన దేశభక్తిని చాటుకుంది. భారత వాయుసేన అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. ఐఏఎప్‌ అధికారులతో కలిసి కన్నీటితో తన భర్తకు ఆర్తి నివాళులు అర్పించింది. భారత జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని ఉన్న ఆమెను చూసిన వారిందరి హృదయాలు బరువెక్కాయి. ఇప్పుడు ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి