Asianet News TeluguAsianet News Telugu

టెక్కీ ప్రియుడి మోజులో.. భర్తను చంపి, గోనెసంచిలో కుక్కి, కారుడిక్కీలో వేసుకుని ఆ భార్య ఎక్కడికి వెళ్లిందంటే...

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కటారా హిల్స్ ప్రాంతంలో ధనరాజ్ మీనా (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ధనరాజ్ మీనా, సంగీత మీనా (34) అనే మహిళను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత దంపతులు సంతోషంగానే ఉన్నారు.

wife murders husband with help of tech lover in madhya pradesh
Author
Hyderabad, First Published Dec 9, 2021, 2:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భోపాల్ :  మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిందో భార్య. ఆ తరువాత తప్పించుకునే దారి లేక శవాన్ని గోనె సంచిలో కుక్కి, కారు డిక్కీలో వేసుకుని బయలు దేరింది. చివరికి ఏమైందంటే...

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కటారా హిల్స్ ప్రాంతంలో ధనరాజ్ మీనా (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ధనరాజ్ మీనా, సంగీత మీనా (34) అనే మహిళను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత దంపతులు సంతోషంగానే ఉన్నారు.

వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల పాటు సంగీత ఆమె భర్త ధనరాజ్ మీనా చాలా హ్యాపీగా గడిపారు. ధనరాజ్ మీనా పని నిమిత్తం ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునేవాడు. పగలంతా సంగీత మీనా... ఇంట్లో ఖాళీగా ఉండేది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె బుద్ది పెడదారి పెట్టింది.

భోపాల్లోని  katara hills ప్రాంతంలోని  సాగర్ గోల్డెన్ పార్క్ కాలనీ లో ఆశిష్ పాండే (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతను అక్కడి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం సంగీత మీనాకు ఆశిష్ పాండేకి పరిచయం అయింది. ఆ తరువాత  ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఆ తరువాత కరోనా వైరస్ వల్ల వర్క్ ఫ్రం హోంతో కారణంగా ఆశీష్ పాండే ఇంటి దగ్గరే ఉంటుండంతో.. మధ్య మధ్యలో వీలు చిక్కినప్పుడు సంగీత ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో తనకంటే వయసులో చిన్నవాడైన ఆశిష్ తో సంగీతకు అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త బయటకు వెళ్లడం ఆలస్యం వెంటనే ప్రియుడు ఆశిష్ ను ఇంటికి పిలిపించుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

Group Captain Varun Singh: గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ పరిస్థితి‌ ఎలా ఉంది.. ఆయన తండ్రి ఏం చెప్పారంటే..

ఈ అక్రమ సంబంధం గురించి స్థానికులకు తెలిసి.. విషయం భర్తకు తెలిపారు. అది తెలిసి ముందు షాక్ అయిన భర్త తరువాత భార్యను హెచ్చరించాడు. ఆ సంబంధం మానుకోవాలని చెప్పాడు. అయితే సంగీత అప్పటికే టెక్కీ ప్రియుడి మోజులో పీకల్లోతుగా కూరుకుపోయింది. భర్త మాట వినలేదు. సరికదా.. అతన్ని అడ్డు తొలగించుకోవాలని టెక్కీ ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

సంగీత.  ప్రియుడు ఆశిష్ పాండే సహాయంతో నిద్రమాత్రలు తెప్పించుకుంది. వాటిని భర్త తినే బిర్యానీ లో కలిపి పెట్టింది.  ఆ తరువాత అతడు నిద్రలోకి జారుకున్న భర్తను సంగీత, ఆమె ప్రియుడు ఆశిష్ పాండే కలిసి కర్రలతో తలమీద చితకబాది చంపేశారు.

ఆ తర్వాత భర్త శవాన్ని మాయం చేయడానికి సంగీత మీనా, ఆశిష్ పాండే అనేకరకాలుగా ప్రయత్నించారు. కానీ ఎలా చేసిన పోలీసులకు దొరికి పోతామని వారికి అర్థమైంది. ఏమి చేయలేక శవాన్ని గోనెసంచిలో మూటకట్టి కారు డిక్కీలో వేసుకుని బయలుదేరారు.  katara hills పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారు.  ఈ మేరకు సీనియర్ పోలీసు అధికారి రాజేష్ Badariya స్థానిక మీడియాకు తెలిపారు.  టెక్కీ ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను అతని భార్య దారుణంగా హత్య చేసిందని వెలుగు చూడటం మధ్యప్రదేశ్లో కలకలం రేపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios