చెన్నై: వదినతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ వ్యక్తి  తన సోదరుడినే హత్య చేశాడు.  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ విషయమై బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లా ఎస్.పుదూర్ సమీపంలోని ముగడంపట్టి తువరంకురిచ్చి రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని పోలీసులకు లభ్యమైంది. అయితే ఈ మృతదేహం వలసైపట్టి గ్రామానికి చెందిన మురుగయ్యదిగా పోలీసులు గుర్తించారు.

 మురుగయ్య భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.  అయితే మురుగయ్య మృతికి  వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు గుర్తించారు.   మురుగయ్య భార్య మణిమేగలై.... మురుగయ్య సోదరుడు పిచ్చుమణితో కొంత కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.

ఈ విషయం తెలిసిన మురుగయ్య భార్యను మందలించాడు. దీంతో భార్యభర్తల మధ్య ప్రతి రోజూ గొడవలు  చోటు చేసుకొంటున్నాయి.  మురుగయ్య ప్రాణాలతో ఉంటే తమ సంబంధాన్ని కొనసాగించలేమని  భావించి అతడిని హత్య చేశారు. ఈ ఇద్దరు కలిసి మురుగయ్యను హత్య చేసి మృతదేహన్ని వంతెన కింద వేశారు. పిచ్చుమణి, మణిమేగలైలను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.