ప్రియుడితో కలిసి  ఓ భార్య  భర్తను హత్య చేసింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


రాంచీ: ప్రియుడితో కలిసి ఓ భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో నివసిస్తున్న తపన్ దాస్, శ్వేతాదాస్‌కు ఎనిమిదేళ్ల అమ్మాయి ఉంది. తపన్ దాస్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. 

దీంతో భర్త ప్రవర్తనతో ఆమె విసిగిపోయింది. ఇదే సమయంలో ఫేస్‌బుక్‌లో మూడు మాసాల క్రితం శ్వేతాదాస్‌ కు సుమిత్ సింగ్‌ పరిచయమయ్యాడు. అయితే ఈ నెల 12వ తేదీన శ్వేతాదాస్ తో భర్త తపన్ దాస్ గొడవకు దిగాడు. భర్తనుు హత్య చేయాలని ఆమె ప్లాన్ చేసింది. తనకు ఫేస్‌బుక్ ద్వారా స్నేహితుడైన సుమిత్ సింగ్‌కు ఆమె ఫోన్ చేసింది.

ఈ ఫోన్‌తో సుమిత్‌సింగ్ తన స్నేహితుడు సోనులాల్‌ను కూడ వెంట తీసుకొని వచ్చాడు. ముగ్గురు కలిసి తపన్‌దాస్ ను హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి గ్రా మశివారులో వేశారు. 

అయితే తన భర్త మద్యం సేవించి ఇంట్లో నుండి రూ.1.5లక్షలను తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. తపన్ దాస్ ఇంటి ముందు పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. ఈ ముగ్గురిని పోలీసులు విచారిస్తే తపన్ దాస్ ను చంపినట్టుగా ఒప్పుకొన్నారు.