బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. భర్తను కొట్టి చంపేసిన మహిళ ఆ విషయం గమనించకుండా రాత్రి ఇంట్లో నిద్రపోయింది. తాగిన మత్తులో పడిపోయాడని భావించి నిద్రించింది. గ్యాస్ సిలిండర్ తేవాలని భార్య అతనికి డబ్బులిచ్చి పంపించిదంి. అయితే, అతను మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో భర్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య చేతిలో భర్త హతమయ్యాడు. కలబురిగి జిల్లా చిత్తపూర్ కు చెందిన ఉమేష్, ఆశ దంపతులు పన్నెండేళ్ల క్రితం బెంగళూరు వచ్చారు. హనుమంతనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు 

లాక్ డౌన్ వల్ల పనులు లేకపోవడంతో భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో గ్యాస్ బండ తీసుకు రావాలని చెప్పి భర్తకు రూ.500 ఇచ్చింది. మద్యానికి బానిస అయిన ఉమేష్ తాగి ఇంటికి వచ్చాడు. గ్యాస్ సిలిండర్ తీసుకుని రాలేదు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆశ అతనితో గొడవ పడింది. 

మద్యం మత్తులో ఉన్న ఉమేష్ రోకలి పండతో తీసుకుని భార్యపై దాడికి ప్రయత్నించాడు. ఆశ ఎదురు తిరిగి రోకలి బండ లాక్కుని భర్త తలపై కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడ పడిపోయాడు. తాగిన మత్తులో పడిపోయాడని భావించి ఆమె రాత్రి నిద్రపోయింది. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఉమేష్ మరణించి పడి ఉన్నాడు.