గృహహింస కింద భర్తను పదేళ్లలో ఏడుసార్లు అరెస్ట్ చేయించింది ఓ భార్య. చేయించిన ప్రతీసారి మళ్లీ తానే బెయిల్ మీద బైటికి తీసుకొచ్చింది.
గుజరాత్ : గుజరాత్ లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భర్తను గృహహింస కేసులో పదేళ్లలో ఏడుసార్లు అరెస్ట్ చేయించింది. చేయించిన ప్రతీసారి ఆమె బెయిల్ ఇప్పించి, పూచీకత్తు పడి మరీ విడిపించింది. ఆ తరువాత మళ్లీ గొడవపడడం.. పోలీసు ఫిర్యాదు.. అరెస్ట్.. బెయిల్.. ఇలా ఏడుసార్లు జరిగింది. ఈ వింతకేసుకు సంబంధించిన వివరాల్లోకి వెడితే..
గుజరాత్‌లోని మెహసానాలో ఓ మహిళ తన భర్తను 10 ఏళ్లలో ఏడుసార్లు గృహహింస కేసు కింద అరెస్టు చేయించింది. ఆ తరువాత తానే విడిపించింది. ప్రేమ్‌చంద్ మాలి, సోనూ భార్యాభర్తలు. ఈ దంపతులు మెహసానా జిల్లాలోని కడి పట్టణంలో నివసిస్తున్నారు.
భారతీయ జ్ఞానం మానవాళికి మేలు చేసింది: డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సా
వీరిద్దరికీ 2001లో వివాహం అయ్యింది. కొద్దికాలం వీరి సంసారం బాగానే సాగింది. ఆ తరువాత 2014లో వారి రిలేషన్‌షిప్‌లో గొడవలు మొదలయ్యాయి. అలా 2015లో సోను తన భర్త తన మీద భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అలా మొదటిసారి ప్రేమ్‌చంద్ మాలిపై డొమెస్టిక్ వయొలెన్స్ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో ఆమెకు నెలవారీ భరణం రూ. 2,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అయితే, రోజువారీ కూలీగా పనిచేసే ప్రేమ్‌చంద్ కు భరణం మొత్తం చెల్లించడం చాలా కష్టంగా మారింది. కోర్టు ఆదేశాల ప్రకారం భరణంచెల్లించనందుకు అతనిని అరెస్టు చేశారు. దీంతో ప్రేమ్‌చంద్ ఐదు నెలలు జైలులో గడిపాడు, అయితే ఆశ్చర్యకరంగా, సోను అతడికి బెయిల్ ఇప్పించడానికి ముందుకు వచ్చింది.
అతని బెయిల్ కోసం ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత వీరిద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. అయినా గొడవ పడడం మానలేదు. ఆ తరువాత కొంత కాలానికి మళ్లీ కలిశారు. కానీ గొడవలు మరింత దారుణంగా మారాయి. అలా గొడవపడడం.. కేసు పెట్టడం, జైలుకు వెళ్లడం మామూలై పోయాయి. ఆ తరువాత మళ్లీ ఆమె బెయిల్ ఇప్పించడం కూడా కామన్ గా మారిపోయింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 2016నుంచి 2018 వరకు ప్రేమ్‌చంద్ ప్రతి సంవత్సరం అరెస్టయ్యాడు. అతనిమీద యేటా సోనూ ఫిర్యాదు చేసింది. తనమీద దాడి చేశాడని ప్రతీసారీ ఆరోపించేది. అరెస్టైన తరువాత ప్రతిసారీ, ఆమె అతనిని విడుదల చేయించింది.
ఆ తరువాత ప్రేమ్‌చంద్ 2019, 2020లో కూడా భరణం చెల్లించలేకపోవడంతో జైలు పాలయ్యాడు. కానీ, మళ్లీ సోనూనే విడుదల చేయించింది. మరోసారి ఈ ఏడాది ప్రారంభంలో ప్రేమ్‌చంద్ మళ్లీ భరణం చెల్లించలేదన్న కారణంతో తాజా అరెస్టు అయ్యాను. అతడిని మళ్లీ సోనూనే మరోసారి జూలై 4న విడుదలచేయించింది. వారు కడిలోని తమ ఇంటికి తిరిగివచ్చారని టీఓఐ తెలిపింది.
తాజా గొడవ ఎందుకొచ్చిందంటే.. ప్రేమ్‌చంద్ పర్సు, సెల్‌ఫోన్ కనిపించకుండా పోయింది. ఆ విషయాన్నే సోనును అడిగాడు. దానికి సోను తనకు తెలియదని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. వాగ్వాదం భౌతిక దాడికి దారి తీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
విసిగిపోయిన ప్రేమ్‌చంద్ చివరకు ఇంట్లోనుంచి వెళ్లిపోయి పటాన్‌లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే సోను, ఆమె కొడుకు కలిసి తనకు హాని చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
