Asianet News TeluguAsianet News Telugu

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోదారుణం.. స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం.. ఆపై ప్రైవేట్ పార్ట్స్ పై సిగరెట్లతో కాల్చి..

Wife Gang Raped :మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే ఆ మహిళ పాలిట కాల కేయుడయ్యాడు. త‌న భర్త అతని నలుగురు స్నేహితులు క‌లిసి .. మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం చేసి.. దారుణంగా చిత్రహింసలకు గురిచేశారని పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
 

Wife Gang Raped By Husband And His Friends In Indore
Author
Hyderabad, First Published Jan 17, 2022, 2:17 AM IST

Wife Gang Raped :  క‌ట్టుకున్న‌వాడు భార్య‌కు  జీవితాంతం తోడు, నీడ‌గా ఉండి, ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల‌ని, కానీ ఓ భ‌ర్త మాత్రం మృగాడు లా మారాడు. కట్టుకున్న భార్య పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం త‌ల దించుకునేలా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను బంధించి.. సిగరెట్ల‌తో కాల్చుతూ చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్​లో చోటు చేసుకుంది. బాధిత‌ మహిళ శరీరంపై సిగరెట్లతో వాతలు పెట్టాడు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ, ఇండోర్‌కు చెందిన ఓ యువ‌కుడిని మ్యాట్రిమోనియల్ సైట్‌లో చూసి  తర్వాత వివాహం చేసుకుంది. అయితే  అతడికి అప్పటికే పెళ్లి విష‌యాన్ని దాచిపెట్టి .. ఆ యువతిని పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం  యువ‌తికి నిత్యం న‌ర‌కం చూపించాడు. ఈ క్ర‌మంలో షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌజ్​లో ఆమెను బంధించాడు. ఈ క్రమంలో త‌న భార్త‌, అత‌ని స్నేహితులు క‌లిసి అత్య‌చారానికి పాల్ప‌డ్డారని, అసహజ శృంగారం చేశారని వెల్లడించింది. అంత‌టితో ఆగ‌కుండా.. ప్రైవేట్ బాడీ పార్ట్స్ పై సిగరెట్లతో కాల్చారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు సహకరించకపోతే చంపేస్తామని బెదిరించారని పేర్కొంది.

ఎలాగోలా ఫామ్‌హౌస్ నుంచి తప్పించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని తన ఇంటికి వెళ్లింది. ఆ త‌రువాత పోలీసుల‌ను ఆశ్ర‌యింంచింది. బాధితురాలి భర్త సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వివరించారు. భర్తే తన స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios