మైసూరు: ప్రియుడితో కలిసి భార్యను హత్య చేసింది ఓ భార్య. సినిమా నుండి స్పూర్తి  భర్తను హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో నిందితురాలు వెల్లడించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని కెఆర్ నగర తాలూకా సాలిగ్రామకు చెందిన 30 ఏళ్ల ఆనంద్ ఈ నెల 23వ తేదీన హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు గురైన ఆనంద్ భార్యపై తొలుత పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణను ప్రారంభించారు.

ఆనంద్ కు శారదతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందే ఆమెకు బాబు  అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఉంది. వివాహం తర్వాత కూడ ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.

తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని శారద భావించింది. భర్తను అడ్డు తొలగించాలని భావించింది. కూతురునను కాపాడేందుకు హీరో విలన్ ను చంపేసి శవాన్ని మాయం చేస్తాడు. ఓ సినిమాలో చూపిన స్టోరీ ఆధారంగా భర్తను హత్య చేయాలని ఆమె ప్లాన్ చేసింది.

ఈ నెల 22వ తేదీన భర్త ఆనంద్ ను హత్య చేసి గ్రామ శివార్లలో మృతదేహాన్ని పారేశారు. హత్యను ప్రమాదంగా ప్రచారం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు శారదను అదుపులోకి విచారిస్తే  అసలు విషయాన్ని ఆమె ఒప్పుకొంది. ప్రియుడి సహాయంతో భర్తను హత్యచేసినట్టుగా ఆమె పోలీసుల విచారణలో ఒప్పుకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.