లక్నో: ప్రియురాలితో కారులో ఎంజాయ్ చేస్తున్న భర్తను  ఓ భార్య రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకొంది. భర్తతో పాటు ప్రియురాలిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది.ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటుచేసుకొంది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగికి పెళ్లై భార్య కూడ ఉంది. అయితే  ఆయనకు మరో మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

ప్రియురాలితో తరచూ కలిసి షికార్లు తిరిగేవాడు.  మంగళవారం నాడు కూడ  ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది.మంగళవారం నాడు  ప్రియురాలిని  తీసుకొని ఆలయానికి వెళ్లాడు. కానీ ఆలయానికి వెళ్లకుండా ఆలయం వెలుపలే కారులో ప్రియురాలితో కూర్చొన్నాడు.

ఆలయం సమీపంలో ఉన్న హోటల్ నుండి వేడి వేడి దోశ తెప్పించుకొని  ప్రియురాలికి కొసరి కొసరి తిన్పిస్తున్నాడు.  కొంతకాలంగా భర్త వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన భార్య అతడిని వెంటాడింది.ప్రియురాలితో కలిసి టిఫిన్ తింటున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది. వారిద్దరిని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. వారిద్దరికి బుద్ది చెప్పాలని పోలీసులను ఆమె కోరింది.

సదరు ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు  హెచ్చరించారు.  అయితే ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సదరు ప్రభుత్వ ఉద్యోగికి ఇదేం కొత్త కాదని తేలింది. గతంలో చాలా మందితో ఆయన తిరిగాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.