తమిళనాడులో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో ఓ భార్య, భర్త మీద పెట్రోల్ పోసి హతమార్చింది. చెన్నై, స్థానిక మడిపాక్కంలో ఈ దుర్మార్గ ఘటన జరిగింది. 

తమిళనాడులో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో ఓ భార్య, భర్త మీద పెట్రోల్ పోసి హతమార్చింది. చెన్నై, స్థానిక మడిపాక్కంలో ఈ దుర్మార్గ ఘటన జరిగింది. 

భర్తపై పెట్రోల్ పోసి హతమార్చిన మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మడి పాక్కం తందై పెరియార్ నగర్ కు చెందిన పాండి, పార్వతి దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. 

గురువారం సాయంత్రం వీరి మధ్య మరోసారి జరిగింది. ఉన్నట్టుండి పాండీ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. పాండీ ఒంటిపై ఉన్న మంటలను ఆర్పి కీల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

పోలీసులు విచారణలో, కుటుంబ తగాదాల కారణంగా భార్య తనపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పాండి వాంగ్మూలం ఇచ్చి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్వతిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.