Asianet News TeluguAsianet News Telugu

భర్తపై హత్య కేసు..ప్రియుడిని పెళ్లాడిన వివాహిత

పెళ్లైనా ఆమెలో మార్పురాలేదు. భర్తకు తెలియకుండా ప్రియుడితో సంబందాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. భర్తే తనను హత్య చేసినట్లు చిత్రీకరించుకుంది. కట్నం కోసం తన కూతుర్ని అల్లుడే హతమార్చాడని చెప్పి తండ్రితో భర్తపై కేసు పెట్టించింది. ఆ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో కాపురం పెట్టేసింది. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది. 

Wife attempts to kill hasband and marries lover
Author
Firozabad, First Published Aug 31, 2018, 12:49 PM IST

ఫిరోజాబాద్: పెళ్లైనా ఆమెలో మార్పురాలేదు. భర్తకు తెలియకుండా ప్రియుడితో సంబందాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎలాగైనా భర్తను వదిలించుకుని ప్రియుడితో కలిసి బతకాలని నిర్ణయించుకుంది. భర్తే తనను హత్య చేసినట్లు చిత్రీకరించుకుంది. కట్నం కోసం తన కూతుర్ని అల్లుడే హతమార్చాడని చెప్పి తండ్రితో భర్తపై కేసు పెట్టించింది. ఆ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని ఢిల్లీలో కాపురం పెట్టేసింది. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ ఘటన ఫిరోజాబాద్ లో చోటు చేసుకుంది. 

ఫిరోజాబాద్ లోని బారాబంకీ ప్రాంతానికి చెందిన రూబీకి అదే ప్రాంతానికి చెందిన రాహుల్ తో 2016 జనవరిలో పెళ్లి అయింది. వివాహానికి ముందే రూబీ, రామూ అనే వ్యక్తిని ప్రేమించింది. రాహుల్ తో పెళ్లైనా రామూతో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. భర్త అంటే ఇష్టం లేని రూబీ 2018లో భర్తే తనను హత్య చేసినట్లు ప్లాన్ చేసింది. 

తన కూతురు రూబీని అల్లుడైన రాహుల్, ఆమె అత్తమామలు రామ్ హర్ష్, బార్కీలు కట్నం కోసం హతమార్చారని రూబీ తండ్రి హరిప్రసాద్ తో పోలీసులకు ఫిర్యాదు చేయించింది.  
కేసు నమోదు చేసిన పోలీసులు హరిప్రసాద్ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. విచారణలో ఎలాంటి  ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు. 

దీంతో హరిప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో ఈ ఏడాది జులైలో కట్నం కోసం రూబీని ఆమె భర్త రాహుల్ హతమార్చాడని పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలో దిగిన పోలీసులకు కేసు దర్యాప్తులో రూబీ చనిపోయినట్లు కనిపెట్టలేకపోయారు. కనీసం రూబీ శవం కూడా లభించలేదు. దీంతో పోలీసులు కేసు విచారణపై మరింత పదునుపెట్టారు.  

రూబీ ఫేస్ బుక్, ఆమె ఫోన్లపై నిఘా వేశారు. రూబీ తన ప్రియుడైన రామూను వివాహం చేసుకొని, అతనితో ఢిల్లీలో నివాసముంటున్నట్లు ఫేస్‌బుక్, ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులు గుర్తించారు. రూబీ ఇంటి అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి రూబీ, రామూలను అరెస్టు చేసి తీసుకువచ్చారు. 

హత్య జరగకుండా కోర్టును తప్పు దారి పట్టించడమేకాకుండా, హత్యకు గురైనట్లు చిత్రీకరించడం, ప్రియుడిని పెళ్లాడిన రూబీ భాగోతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం చేయని రాహుల్ పై కేసు ఎత్తివేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios