Asianet News TeluguAsianet News Telugu

భర్తను దారికి తెచ్చుకోవాలనుకుని.. భార్య దారి తప్పింది.. చివరికి జైలు పాలయ్యింది....

అనుమానంతో వేధిస్తున్న భర్తను దారికి తెచ్చుకుందామని ఓ భార్య చేసిన ప్రయత్నం వికటించింది. భర్త మృతి చెందాడు. ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

wife assassinated husband, arrested in karnataka
Author
First Published Sep 5, 2022, 10:43 AM IST

కర్ణాటక : అక్రమ సంబంధం అంటూ పదే పదే అనుమానిస్తున్న భర్తను దారికి తెచ్చుకోవడానికి ఓ భార్య చేసిన పని.. చివరికి అతని మరణానికి కారణమయ్యింది. దీంతో ఆ భార్యను, ఆమెకు సహకరించిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మండ్యకు చెందిన మహేష్ కు అదే ఊరికి చెందిన శిల్పాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరిద్దరూ బెంగళూర్ లోని కోణనకుంటెలో నివాసం ఉంటున్నారు. అయితే పని నిమిత్తం మండ్యలో ఉంటున్న మహేష్ అప్పుడప్పుడు బెంగళూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలో తాగిన మత్తులో శిల్పపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ వేధించేవాడు. దీంతో శిల్ప తల్లి దగ్గర ఈ విషయం చెప్పుకుని ఏడ్చింది. 

గత గురువారం బెంగళూరుకు వచ్చిన మహేష్ ను హెచ్చరించాలని శిల్ప తన అన్న కుమారుడు బాలాజీని పురమాయించింది. దీంతో బాలాజీ మహేష్ ను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని తీసుకుని శిల్ప మండ్యకు వెళ్లింది. అనుమానం వచ్చిన మహేష్ తల్లిదండ్రులు మండ్య పోలీసులకు ఫిర్యాదు చేయడందతో శిల్పను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా అసలు విషయం బయట పడింది. శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. 

బెంగళూరులో వర్ష బీభత్సం.. జలదిగ్భంధంలో అనేక ప్రాంతాలు..

కాగా, ఆగస్ట్ 3న ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై ఓ కొత్త జంటను బలితీసుకుంది. పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే రెండు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త పురుగుల మందు తాగి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..  ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్ (26)కు ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేటకు చెందిన నాగేశ్వరరావు శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె  పుష్పలీల(19)తో జూన్ 15న వివాహం అయింది. హరీష్ కు సోదరుడు, అక్క ఉన్నారు. 

తల్లి పదేళ్ల కిందటే మృతి చెందింది. తండ్రి కూలీ పనులు పనిచేస్తుంటాడు. పెళ్లయినప్పటి నుంచి పుష్పలీలపై అనుమానం పెంచుకున్న హరీష్ శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో వారికి ఎందుకు చెప్పావ్ అంటూ ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి వారిని కలిపారు. కాగా పుష్పలీల ఫోన్ లో తన తల్లిదండ్రులతో మాట్లాడితే ఇంక ఎవరితోనో మాట్లాడుతుంది.. అని అనుమానం పెంచుకున్న హరీష్ వేధింపులు ఇంకా ఎక్కువ చేశాడు.  

ఘటన జరిగిన రోజు ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన హరీష్  రాత్రి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిద్రకుపక్రమించిన సమయంలో గొడ్డలితో మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత బయటకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారి ఉదయం ఇరుగు పొరుగు వారు గమనించి ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios